ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిజిటల్‌ గ్రంథాలయం విద్యార్థులకు అంకితం

ABN, First Publish Date - 2022-08-08T05:13:23+05:30

నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో గల ఏపీ బాలుర గురుకుల పాఠశాలలో ఆది వారం పూర్వ విద్యార్థులు రూ. 30 లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్‌ గ్రంథాలయం విద్యార్థులకు అంకి తం చేశారు.

విద్యార్థులకు స్పోర్ట్స్‌ కిట్స్‌ను అందిస్తున్న పూర్వ విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


నర్సీపట్నం అర్బన్‌, ఆగస్ట్టు 7: నర్సీపట్నం మునిసిపాలిటీ పరిధిలోని పెదబొడ్డేపల్లిలో గల ఏపీ బాలుర గురుకుల పాఠశాలలో ఆది వారం పూర్వ విద్యార్థులు రూ. 30 లక్షలతో ఏర్పాటుచేసిన డిజిటల్‌ గ్రంథాలయం విద్యార్థులకు అంకి తం చేశారు. ఈ సందర్భంగా పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ.. విద్యార్థులు డిజిటల్‌ గ్రంథాలయాన్ని సద్వినియోగపర్చుకోవాలన్నారు. ఈ పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యను తాము పొందామని, ఇక్కడ విద్యను అభ్యసించిన తామంతా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో స్థిరపడ్డామన్నారు. ఈ పాఠశాలలో 18 ఏళ్లకు సంబంధించిన పూర్వవిద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో డిజిటల్‌ తెరపై విద్యార్థులకు చూపించారు. పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈఏడాది పదో తరగతి పరీక్షల్లో ప్రథమ బహుమతిగా రూ.ఐదు వేలు, ద్వితీయ బహుమతిగా రూ.మూడు వేలు, తృతీయ బహుమతిగా రూ.రెండు వేలు విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు బండారు రామచంద్రరావు, కోశాధికారి కేవీ.అప్పారావు, సభ్యులు చంటి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:13:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising