ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న దర్శనానికి తరలివచ్చిన భక్త జనం

ABN, First Publish Date - 2022-05-22T05:10:54+05:30

వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. సింహగిరి జనసంద్రమయ్యింది.

కేశ ఖండనశాల వద్ద భక్తుల రద్దీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్క రోజు రూ.38.74 లక్షల ఆదాయం

సింహాచలం, మే 21: వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి శనివారం భారీ సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. సింహగిరి జనసంద్రమయ్యింది. ప్రధానంగా కేశఖండనశాల, గంగధార, అనంతరం స్వామి దర్శనం క్యూలు, ప్రసాదాల కౌంటర్ల వద్ద రద్దీ నెలకొంది. కేశ ఖండన శాల వద్ద భక్తులు ఎక్కువ సేపు నిరీక్షించాల్సివచ్చింది. శనివారం అప్పన్నస్వామి ఖజానాకు సుమారు రూ.38.74 లక్షల ఆదాయం సమకూరింది.


ఇందులో స్వామివారి అతిశ్రీఘ్ర, శ్రీఘ్ర దర్శన టికెట్ల ద్వారా రూ.22.02 లక్షలు, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.8.92 లక్షలు, తలనీలాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.2.7 లక్షలు, ఆర్జిత సేవల ద్వారా రూ.79,750లు, టోల్‌గేటు వాహనాల  టికెట్ల ద్వారా రూ.71.175లు, అన్నప్రసాద విరాళాల ద్వారా రూ.37,088లు  ఇతర ఆదాయాలతో కలిపి మొత్తం రూ.38,74,133ల ఆదాయం సమకూరింది. అధికారులు అవసరమైన సదుపాయాలు కల్పించారు. 

Updated Date - 2022-05-22T05:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising