ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమష్టి కృషితో గ్రామాల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-07-15T06:53:26+05:30

సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గ్రామాల్లో సమస్యలను ప్రస్తావించినప్పడు వాటి పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఎస్‌.రాయవరం మండల సమావేశంలో ఎంపీపీ శారదాకుమారి సూచన

  గ్రామాల్లో సమస్యలపై ఏకరువు పెట్టిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు

ఎస్‌.రాయవరం, జూలై 14 : సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు గ్రామాల్లో సమస్యలను ప్రస్తావించినప్పడు వాటి పరిష్కారానికి అధికారులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి సూచించారు. గురువారం ఇక్కడ జరిగిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తొలుత ఆమె మాట్లాడారు. సమష్టి కృషితో గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం హౌసింగ్‌ ఏఈ ప్రతాప్‌  ఇళ్ల పథకానికి సంబంధించి మాట్లాడుతుండగా,  ఎంపీటీసీలు బొలిశెట్టి గోవిందరావు, బి.శ్రీనివాసరావు, రేవుపోలవరం సర్పంచు లోవరాజు, వాకపాడు సర్పంచు  ఎం.శ్రీని వాసరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు లేచారు. ఇళ్ల నిర్మాణ పథకానికి సంబంధించి గ్రామాల్లో సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోమని చెప్పి, ఇప్పటివరకు ఎందుకు మంజూరు ఇవ్వలేదంటూ నిలదీశారు. దానికి ఆయన ఎల్‌పీసీలు లేక పోవడంతో సొంత స్థలాల్లో ఇళ్లు మంజూరు అవ్వలేదని వివరించారు. దీంతో తాహ సీల్దార్‌ శ్రీనివాస్‌ స్పందిస్తూ సమస్యను పరిష్కారిస్తామని, ఎల్‌పీసీలు తయారుచేసి తీసుకురావాలని ఏఈకి సూచించారు. ఎంఈవో ఎ.ఎస్‌.ఎన్‌.ఎ.మూర్తి మాట్లాడుతూ మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలు, రెండు ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 6,7,8, తరగతులను సమీపంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం జరుగుతుందన్నారు. దీనిపై కొన్నిచోట్ల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలల ముందు నిరసన తెలుపుతున్నారని,  విలీనం అనేది తమ చేతుల్లోనిది కాదని చెప్పారు.  అనంతరం పలువురు సర్పంచులు ఆయా గ్రామాల్లో సమస్యలను వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి బదిలీపై వచ్చిన పలువురు అధికారులు సభ్యులను పరిచయం చేసుకున్నారు. జడ్పీటీసీ కాకర దేవి, ఎంపీడీవో రామచంద్రమూర్తి, వైస్‌ ఎంపీపీలు చోడిపల్లి అప్పన్న, కోన లక్ష్మిలతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-15T06:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising