ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్బీకేల్లోనే ధాన్యం నాణ్యత నిర్ధారణ

ABN, First Publish Date - 2022-12-11T00:20:35+05:30

జిల్లాలో ధాన్యం నాణ్యతను రైతుభరోసా కేంద్రాల్లోనే నిర్ధారిస్తారని జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు తెలిపారు. మిల్లర్లు, మధ్యవర్తులు దాన్యం నాణ్యతను నిర్ధారించేందుకు అవకాశం లేదన్నారు.

మాట్లాడుతున్న జేసీ శివశ్రీనివాసు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు

పాడేరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం నాణ్యతను రైతుభరోసా కేంద్రాల్లోనే నిర్ధారిస్తారని జాయింట్‌ కలెక్టర్‌ జె.శివశ్రీనివాసు తెలిపారు. మిల్లర్లు, మధ్యవర్తులు దాన్యం నాణ్యతను నిర్ధారించేందుకు అవకాశం లేదన్నారు. అటువంటి అపోహలను నమ్మవద్దన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు బాధ్యతను సైతం ఆర్బీకేలే తీసుకుంటాయన్నారు. జిల్లాలో రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 43 కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 404 టన్నులు కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు తగ్గకుండా, తేమ 17 శాతం మించకుండా ధాన్యం ఆరబెట్టుకోవాలని రైతులకు సూచించారు. అలాగే రైతుభరోసా కేంద్రం సిబ్బంది రైతుల ఇళ్ల వద్దకే వచ్చి మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో వరి కోసిన రైతులు పనలను భద్రపరచుకోవాలని సూచించారు. అలాగే పంట తడవకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించి, పంటను రక్షించుకోవాలని జేసీ కోరారు.

Updated Date - 2022-12-11T00:20:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising