ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనుల ఇళ్లు కూల్చేయడం అన్యాయం

ABN, First Publish Date - 2022-05-28T06:42:34+05:30

గిరిజనులు తమ పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చేయడం అన్యాయమని స్థానిక జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం అన్నారు.

బాధిత రిలే దీక్షల్లో పాల్గొన్న జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


బాధితుల దీక్షల్లో పాల్గొన్న జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం 

హుకుంపేట, మే 27: గిరిజనులు తమ పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చేయడం అన్యాయమని స్థానిక జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం అన్నారు. బాధిత గిరిజనులు చేపట్టిన రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. గిరిజనులైన గోమంగి దొన్ను, తిరుపతిరావు తమ పట్టా భూమిలో రేకుల ఇళ్లను నిర్మించుకుంటే, అకారణంగా రెవెన్యూ అధికారులు కూల్చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ సమస్యను స్థానిక రెవెన్యూ అధికారులు త్వరలోనే పరిష్కరించకుంటే పైస్థాయికి తీసుకువెళతామని మత్స్యలింగం హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు. తమకు జరిగిన అన్యాయానికి నష్టపరిహారం చెల్లించాలని బాధిత గిరిజనులు డిమాండ్‌ చేశారు. బాధితులకు సూకూరు సర్పంచ్‌ సత్యవతి, ఎంపీటీసీ సభ్యుడు సింహాచలం మద్దతు పలికారు.

Updated Date - 2022-05-28T06:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising