ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాలిమెరకలో ఆక్రమణలు కూల్చివేత

ABN, First Publish Date - 2022-08-04T06:50:29+05:30

మండల కేంద్రానికి అతి సమీపాన వున్న వాలిమెరక గ్రామంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆక్రమణలను బుధవారం రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు.

వాలిమెరకలో షెడ్డును కూల్చివేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి’ కథనంతో స్పందించిన అధికారులు 

ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు: ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ 

పెందుర్తి, ఆగస్టు 3: మండల కేంద్రానికి అతి సమీపాన వున్న వాలిమెరక గ్రామంలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఆక్రమణలను బుధవారం రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం ప్రచురితమైన ‘వాలిమెరకలో వాలిపోయారు’ కథనానికి అధికారులు స్పందించారు. ఆర్డీవో హుస్సేన్‌ సాబ్‌ ఆదేశాల మేరకు ఉప తహసీల్దార్‌ రంగలక్ష్మి పర్యవేక్షణలో సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఆక్రమణలను తొలగించారు. ఇక్కడ గల సర్వే నంబర్‌-58లో 1.84 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికార, విపక్ష పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆక్రమించి పది షెడ్లు నిర్మించడంతో సిబ్బంది పొక్లయినర్‌తో నాలుగు షెడ్లను కూల్చివేశారు. మిగతా ఆరు షెడ్లలో పలువురు నివసిస్తుండడంతో వారికి ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు. వారు ఖాళీ చేశాక వాటిని కూడా కూల్చివేస్తామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. కాగా ఈ స్థలం దశాబ్దాలుగా తమ ఆధీనంలో వుందని, అందువల్లే షెడ్లు నిర్మించుకుని కుటుంబాలతో వుంటున్నామని సిబ్బంది వద్ద వారు తమ ఆవేదన వెలిబుచ్చారు. 

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు

ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఆక్రమణదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని.. క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆర్డీవో హుస్సేన్‌ సాహెబ్‌ హెచ్చరించారు. విశాఖ నగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణే తమ ధ్యేయమని, ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.


Updated Date - 2022-08-04T06:50:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising