నగరంలో 5 కొత్త డిగ్రీ కళాశాలలు
ABN, First Publish Date - 2022-09-04T06:54:31+05:30
నగర పరిధిలోని దక్షిణం, ఉత్తరం, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాలతోపాటు అనకాపల్లి నియోజకవర్గంలో నూతనంగా డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు
కళాశాల విద్య కమిషనర్ పోలా భాస్కర్
మద్దిలపాలెం, సెప్టెంబరు 3: నగర పరిధిలోని దక్షిణం, ఉత్తరం, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాలతోపాటు అనకాపల్లి నియోజకవర్గంలో నూతనంగా డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్టు ఆంధ్రప్రదేశ్ కళాశాల విద్యా కమిషనర్ పోలా భాస్కర్ తెలిపారు. డాక్టర్ వీఎస్ కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను శనివారం ఆయన సందర్శించారు. కళాశాల భవనాలు, మౌలిక వసతులు, బోధనా పద్ధతులు, జాబ్ మేళాలు, ఇంటర్న్‌షిప్ కార్యాక్రమాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరకులోయ, తగరపువలస, నక్కపల్లి, విజయనగరం, గజపతినగరం, ముమ్మిడివరం ప్రాంతాల్లో ఇప్పటికే ఏర్పాటుచేసిన కళాశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకానికి చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కృష్ణా డిగ్రీ కళాశాలను క్లస్టర్‌గా మార్చి, ఇక్కడ రీసెర్చ్, స్టూడియో ఏర్పాటు చేయనున్నామన్నారు. కృష్ణా కళాశాలల్లో ఇంటర్న్‌షిప్ కల్పించే మేళాలు నిర్వహించడం ఆకట్టుకుందని, మిగతా కళాశాలలు దీన్ని అనుసరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ విజయబాబు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - 2022-09-04T06:54:31+05:30 IST