ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డి.పట్టా భూములకు వన్‌బి ఇవ్వాలి

ABN, First Publish Date - 2022-09-10T06:28:49+05:30

సాగు చేసుకుంటున్న డి.పట్టా భూములకు వన్‌ బి, అండగల్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం తురకలపూడి రైతులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


తురకలపూడి రైతుల ఆందోళన 

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 9: సాగు చేసుకుంటున్న డి.పట్టా భూములకు వన్‌ బి, అండగల్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం తురకలపూడి రైతులు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. 227, 381 సర్వే నంబర్లలో సుమారు 150 ఎకరాల బంజర్లకు 70 సంవత్సరాల క్రితం 30 దళిత కుటుంబాలకు డి ఫారమ్‌ పట్టాలు మంజూరు చేశారు. 2018 నుంచి సాగు చేసుకుంటున్న భూములకు వన్‌ బి, అండగల్‌ మంజూరు కాకపోవడంతో వాణి జ్య బ్యాంకులు రుణం మంజూరు నిలిపివేశారన్నారు. దీంతో సాగుకు పెట్టుబడులు లేక పంటలు కోల్పోతున్నామని రైతులు బొడ్డు శ్రీను, ఆరిపాక ఈశ్వరరావు, లక్ష్మి, బొబ్బాది నూకాలు, జల్లూరి ఆదినారాయణ తదితర రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని నాలుగేళ్లుగా కోరుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడాన్ని వారు ఆక్షేపించారు. అనంతరం ఈ మేరకు తహసీల్దార్‌ ఎస్వీ.అంబేడ్కర్‌కి వినతిపత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి తగిన చర్యలు చేపడతానని అంబేడ్కర్‌ రైతులకు హామీ ఇచ్చారు.


Updated Date - 2022-09-10T06:28:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising