ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారిడార్‌ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి

ABN, First Publish Date - 2022-08-13T06:15:56+05:30

కారిడార్‌ నిర్వాసిత రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం జిరాయితీ, సాగు, డి.పట్టా భూములకు ఒకేలా పరిహారం ఇవ్వాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు.

సమావేశమైన అఖిలపక్ష నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఖిలపక్ష నాయకుల డిమాండ్‌

నక్కపల్లి, ఆగస్టు 12: కారిడార్‌ నిర్వాసిత రైతులకు పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వాలని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం జిరాయితీ, సాగు, డి.పట్టా భూములకు ఒకేలా పరిహారం ఇవ్వాలని అఖిల పక్ష నాయకులు డిమాండ్‌ చేశారు. నక్కపల్లి మండలంలో విశాఖ- చెన్నై ఇండస్ర్టియల్‌ కారిడార్‌ కోసం ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించిన భూములకు సంబంధించి కారిడార్‌ నిర్వాసిత రైతులతో అఖిలపక్ష పార్టీల నాయకులు శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఒకేచోట పునరావాసం కల్పించాలని, 18 ఏళ్ల వయస్సు నిండిన వారందరికీ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పటి వరకు ఈ భూముల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని, అలా చేస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ తోట నగేశ్‌, వైస్‌ ఎంపీపీ వీసం నానాజీ, టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్‌, వేంపాడు పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి అయినంపూడి మణిరాజు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజు, అమలాపురం సర్పంచ్‌ పెదపూడి శంకరరావు, ఉప సర్పంచ్‌ గంటా నర్సింగరావు, ఎంపీటీసీ సభ్యుడు గంటా తిరుపతిరావు, తళ్లా భార్గవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-13T06:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising