ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులు 992

ABN, First Publish Date - 2022-01-15T05:52:15+05:30

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందలాది మంది వైరస్‌ బారినపడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో శరవేగంగా వైరస్‌ వ్యాప్తి

14 రోజులు..3,859 కేసులు

గత మూడు రోజుల్లోనే 2,510...

వైరస్‌ బారినపడి ఈ నెలలో నలుగురు మృతి


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వందలాది మంది వైరస్‌ బారినపడుతున్నారు. ఈ నెల మొదటి రెండు వారాల్లోనే 3,859 కేసులు నమోదయ్యాయంటే వైరస్‌ వ్యాప్తి ఏ స్థాయిలో వుందో ఇట్టే అర్థం చేసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన 40 మందికి వైరస్‌ సోకగా, వారం వ్యవధిలో అంటే ఏడో తేదీన 185 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  నాటి నుంచి ప్రతిరోజూ కేసులు రెట్టింపు అవుతూ వచ్చాయి. ఈ నెల 11న 295, 12న 695, 13న 823 నమోదవ్వగా, శుక్రవారం ఏకంగా 992 కేసులు వచ్చాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.


32.58 శాతం పాజిటివిటీ.. 

జిల్లాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. జిల్లాలో శుక్రవారం 3045 మందికి పరీక్షలు నిర్వహించగా 992 మంది (32.58 శాతం)కి వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. వీటితో మొత్తం కేసుల సంఖ్య 1,63,284కు చేరింది. ఇందులో 1,58,514 మంది కోలుకోగా, మరో 3,658 మంది ఇళ్లు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కొవిడ్‌ బారినపడి జిల్లాలో 1,112 మంది (ఈ నెలలో నలుగురు) మృతిచెందారు. 


ఉక్కునగరంలో కొవిడ్‌ విజృంభణ

స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.  ఉక్కు జనరల్‌ ఆస్పత్రిలో గురువారం 207 మందికి పరీక్షలు నిర్వహించగా, 116 మందికి పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయ్యింది. ఈ ఆస్పత్రిలో సోమ, మంగళ, గురు, శనివారాల్లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వారంలో మూడు రోజుల్లో మొత్తం 490 మందికి పరీక్షలు నిర్వహించగా, 264 మందికి పాజిటివ్‌ వచ్చింది. బాధితులు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. వీరికి ఉక్కు ఆస్పత్రి వైద్యులు ఫోన్‌ ద్వారా పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. పరీక్షలు  చేయించుకున్న వారిలో సగం మందికిపైగా పాజిటివ్‌ రావడంతో ఆందోళన వ్యక్తమవుతున్నది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.


మంత్రి ముత్తంశెట్టికి కరోనా

విశాఖపట్నం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు కరోనా వైరస్‌ సోకింది. స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన కొవిడ్‌ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆయన సీతమ్మధారలో గల నివాసంలో హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనను కలిసిన వ్యక్తులు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఒక ప్రకటనలో కోరారు. ఎవరూ ఇంటికి రావద్దని, అత్యవసరమైతే ఫోన్‌లో సంప్రతించాలన్నారు. మంత్రి కొవిడ్‌ బారినపడడం ఇది రెండోసారి.

Updated Date - 2022-01-15T05:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising