ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

న్యాయమూర్తిగా ఎంపికైన మహిళా న్యాయవాదికి సత్కారం

ABN, First Publish Date - 2022-09-25T06:27:11+05:30

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షల్లో రెండో ర్యాంక్‌ సాధించి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన ప్రముఖ న్యాయవాది సీహెచ్‌ శ్రీవిద్యను పలువురు న్యాయవాదులు ఘనంగా సత్కరించారు.

న్యాయమూర్తిగా ఎంపికైన శ్రీవిద్యను సత్కరించిన న్యాయవాదులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపట్నం, సెప్టెంబరు 24: తెలుగు రాష్ట్రాల్లో జరిగిన జూనియర్‌ సివిల్‌ జడ్జి పరీక్షల్లో రెండో ర్యాంక్‌ సాధించి జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన ప్రముఖ న్యాయవాది సీహెచ్‌ శ్రీవిద్యను పలువురు న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. ఇక్కడి లక్ష్మీనగర్‌లో శనివారం జరిగిన అభినందన సభలో హైకోర్టు సీనియర్‌ న్యాయవాది గొలగాని అప్పారావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ద్వారా సమాజాభివృద్ధి సాధ్యమన్నారు. న్యాయవాదిగా సేవలందిస్తూ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీవిద్య భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిని అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం శ్రీవిద్య మాట్లాడుతూ సహచర న్యాయవాదుల సహకారం, ప్రోత్సాహంతోనే తాను న్యాయమూర్తిగా ఎంపికయ్యానన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ న్యాయమూర్తిగా ఉత్తమ సేవలందించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం ఆమెను పలువురు న్యాయవాదులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు సీహెచ్‌ ప్రసాద్‌, కె.మధురావు, ఉమాభారతి, పి.సతీశ్‌, తిరుమలరావు, ప్రసాద్‌, శేషగిరిరావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T06:27:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising