ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మఒడిలో గందరగోళం

ABN, First Publish Date - 2022-06-26T04:36:22+05:30

అమ్మఒడి పథకంలో 1.29 లక్షల మందికి కోత విధించి ప్రభుత్వం లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును సస్సెన్స్‌ అకౌంట్లలో ఉంచారన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జగదీష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌ 

అనకాపల్లిఅర్బన్‌, జూన్‌ 25: అమ్మఒడి పథకంలో 1.29 లక్షల మందికి కోత విధించి ప్రభుత్వం లబ్ధిదారులను గందరగోళానికి గురిచేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన సొమ్మును సస్సెన్స్‌ అకౌంట్లలో ఉంచారన్నారు. పాఠశాలలకు గైర్హాజరయ్యారని 51వేల మంది విద్యార్థులను పథకానికి అనర్హులుగా ప్రకటించారన్నారు. మరో 78 వేల మందికి కుంటిసాకులతో ఎగనామం పెట్టారన్నారు. అంతేకాకుండా రూ.15 వేలకు బదులు రూ.13వేలు మాత్రమే ఖాతాల్లో జమ చేయడం అన్యాయమన్నారు. విద్యుత్‌ వినియోగం 300 యూనిట్లు దాటిందని కొంతమందికి, విద్యార్థుల హాజరు 75 శాతం లేదని మరికొంతమందికి, పట్టణ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు నిర్మించారని, రేషన్‌ కార్డు లేదని మరికొంత మందిని అనర్హులుగా ప్రకటించారన్నారు. ఈ నిబంధనల వల్ల రాష్ట్రంలో లక్ష మంది తల్లులకు పథకం వర్తించకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  ఆధార్‌కార్డును బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేయాలని ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసిందని, కొంతమందికి ఈ ప్రక్రియ పూర్తికాకపోవడంతో పథకం నిలిపివేసిందన్నారు. మరికొంతమంది వారి బ్యాంకు ఖాతాలకు ఎన్‌ిపీసీఐ చేయించుకున్నప్పటికీ అమ్మఒడి రాలేదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం వర్తింపజేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ  అనకాపల్లి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, అధికార ప్రతినిధి కడిమిశెట్టి నరసింగరావు, కార్యదర్శి మువ్వల అప్పలనాయుడు, మీడియా కో-ఆర్డినేటర్‌ కొణతాల వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T04:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising