కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
ABN, First Publish Date - 2022-02-08T06:33:19+05:30
పీఆర్‌సీలో తమ ప్రయోజనాలను విస్మరించారంటూ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సోమవారం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
పీఆర్‌సీ ఒప్పందాలపై నిరసన
శాంతియుత ర్యాలీ చేపట్టేందుకు యత్నం
100 మంది కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌కు తరలింపు
విశాఖపట్నం, ఫిబ్రవరి 7: పీఆర్‌సీలో తమ ప్రయోజనాలను విస్మరించారంటూ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ సిబ్బంది సోమవారం జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అక్కడ నుంచి కలెక్టరేట్‌కు శాంతియుత ర్యాలీ నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వాహనాల్లోకి ఎక్కించి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులకు నిరసనగా సాయంత్రం సీఐటీయూ కార్యాలయం నుంచి జగదాంబ వరకు నిరసన ప్రదర్శన చేశారు.
Updated Date - 2022-02-08T06:33:19+05:30 IST