ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాడి తప్పిన సమగ్ర శిక్షా!

ABN, First Publish Date - 2022-03-16T05:52:36+05:30

సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కార్యాలయంలో పాలన గాడి తప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిబ్బంది ఇష్టారాజ్యం

మెటర్నరీ లీవ్‌లకు ఉపాధ్యాయుల వద్ద డబ్బులు వసూలు

కొరవడిన పర్యవేక్షణ

‘నాడు-నేడు’ పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు శూన్యం

విద్యార్థుల విహార యాత్రల కోసం కేటాయించిన నిధులు దారిమళ్లింపు

 రికవరీతో సరి...


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) కార్యాలయంలో పాలన గాడి తప్పింది. కార్యాలయాన్ని పర్యవేక్షించాల్సిన అడిషనల్‌ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌ (ఏపీసీ) పోస్టు గత ఏడాది జూలై నుంచి ఖాళీగా ఉంది. అప్పటి నుంచి ఏపీసీగా డీఈవో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిరోజు కార్యాలయానికి వచ్చి సిబ్బందిని పర్యవేక్షించడం, పనితీరును సమీక్షించడం డీఈవోకు సాధ్యం కాదు. దీంతో ఎస్‌ఎస్‌ఏ కార్యాలయంలో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.


క్షేత్రస్థాయి పర్యటనలు చేసే సెక్టోరియల్‌ అధికారులు, ఇంజనీరింగ్‌ విభాగం మినహా మిగిలిన సిబ్బంది ఠంచనుగా ఉదయం 10.30 గంటలకల్లా విధులకు హాజరవ్వాలి. సెక్టోరియల్‌ అధికారి ఒకరు విధులకు గైర్హాజరవుతున్నారు. అలాగే కార్యాలయంలో కొందరు సిబ్బంది అన్ని పనులు చూసుకుని తీరిక దొరికినప్పుడు కార్యాలయానికి వచ్చి పోతున్నారు. సెక్షన్‌లను పర్యవేక్షించాల్సిన సీనియర్లు కూడా ఆలస్యంగా వస్తుంటారు. అదేవిధంగా కార్యాలయంలో ప్రతి పనికీ ఒక రేటు పెట్టేశారని పలువురు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. కేజీబీవీల్లో పనిచేసే సిబ్బంది మెటర్నటీ సెలవుల ఆమోదానికి సంబంధిత ఫైళ్లు చూసే ఉద్యోగి ఒకరు డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  అలాగే నాడు-నేడు కింద తొలిదశలో చేపట్టిన పనుల్లో భారీ అవకతవకలు జరిగాయి. ఇందుకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాలపై అధికారులు విచారణ చేపట్టారు. ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లాయి. అయినా ఇంతవరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం గానీ, రికవరీ చేయడం గానీ జరగలేదు. పద్మనాభం, రోలుగుంట, పాడేరు, హుకుంపేట, పెదబయలు తదితర మండలాల్లో చేపట్టిన పనుల్లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. నగరంలోని తోటగరువు జడ్పీ పాఠశాలలో నాడు-నేడు పనుల్లో అవతవకలు జరిగాయని విద్యా శాఖ అధికారులు అంగీకరించినా...ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పనులు పూర్తయిన తరువాత థర్డ్‌ పార్టీతో విచారణ చేపట్టాల్సి ఉంది. ఆ విషయం కూడా అధికారులు మరచిపోయారు. ఎస్‌ఎస్‌ఏ ఇంజనీరింగ్‌ విభాగంలో కొందరు అధికారులు,సిబ్బంది ప్రతిపనికీ పర్సంటేజీలు తీసుకుంటున్నా అడిగే నాథుడు లేడు. పాఠశాలలకు రంగులు వేసే పనిని కంపెనీలు స్థానికంగా చిరు వ్యాపారులకు అప్పగించినా ఇంజనీర్లు ప్రశ్నించలేదు. భారీగా ముడుపులు అందడమే అందుకు కారణమని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ఇంజనీరింగ్‌ విభాగానికి పూర్తిస్థాయి ఈఈ లేరు. జిల్లాలో మెజారిటీ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో చేపట్టిన నాడు-నేడు పనుల్లో నాణ్యత లేదనేది బహిరంగ రహస్యం. కొన్నిచోట్ల ప్రిన్సిపాళ్లు, తల్లిదండ్రుల కమిటీలు, ఇంజనీరింగ్‌ అధికారులు ఏకమై నిధులు స్వాహా చేశారు. పనుల్లో నాణ్యతపై గర్ల్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి (జీసీడీవో) కూడా నోరు మెదపలేదు. నాణ్యత గురించి ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు చూసుకుంటారని, మీరు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని జీసీడీవోను ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించినట్టు ప్రచారం జరిగింది. 


ఇదిలావుండగా పాఠశాలల పిల్లలను విహార యాత్రలకు తీసుకువెళ్లడానికి రెండేళ్ల క్రితం సుమారు రూ.12 లక్షల నుంచి రూ.13 లక్షలు నిధులు వచ్చాయి. అయితే కరోనా కారణంగా విహారయాత్రలకు తీసుకువెళ్లలేదు. అయితే ఆ నిధులను కొంతమంది దారిమళ్లించగా...అప్పటి అకౌంట్స్‌ అధికారి అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో ఆ నిధులను తిరిగి ప్రభుత్వానికి జమ చేశారు కానీ, అందుకు బాధ్యుడైన అధికారిపై మాత్రం చర్యలు తీసుకోలేదని అంటున్నారు. పంచాయతీరాజ్‌ శాఖలో సీనియర్‌ ఎంపీడీవోగా వున్న బి.శ్రీనివాసరావును గత నెలలో సర్వశిక్షా అభియాన్‌ ఏపీసీగా నియమించారు. జీవో ఇచ్చినా పంచాయతీరాజ్‌ శాఖ నుంచి ఇంకా ఆయన్ను రిలీవ్‌ చేయలేదు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రిలీవ్‌ చేస్తే శ్రీనివాసరావు విశాఖలో ఏపీసీగా బాధ్యతలు తీసుకుంటారని విద్యా శాఖ వర్గాలు చెబుతున్నాయి.  

Updated Date - 2022-03-16T05:52:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising