ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమగ్ర శిక్ష!

ABN, First Publish Date - 2022-12-12T01:30:09+05:30

సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు నవంబరు నెల జీతాలు ఇప్పటివరకు అందలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం

ప్రతి నెలా రెండో వారంలోనే అందుతున్న డబ్బులు

ఈ నెల 11వ తేదీ దాటినా విడుదల కాని బడ్జెట్‌

ఉమ్మడి జిల్లాలో 1,500 మందికిగాపైగా ఉద్యోగులు

కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ఆవేదన

విశాఖపట్నం, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) పరిధిలోని పలు విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు నవంబరు నెల జీతాలు ఇప్పటివరకు అందలేదు. ఈ పరిధిలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), మండల విద్యాశాఖ, స్కూలు కాంప్లెక్స్‌లలో టీచర్లు, ఆపరేటర్లు, సీఆర్‌పీలు, అటెండర్లు పనిచేస్తుండగా... వీరంతా జీతాలు అందక కటకటలాడుతున్నారు. చివరకు ప్రభుత్వ పరిధిలో పలు శాఖల నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, టీచర్లకు కూడా జీతాలు అందలేదు. ప్రతినెల ఒకటో తేదీన ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జీతాలు జమకావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ఐదారు నెలలుగా ప్రభుత్వం సగానికిపైగా ఉద్యోగులకు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు జీతాలను బట్వాడా చేస్తోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులకు రెండు రోజుల క్రితమే జీతాలు అందగా, మరికొన్ని చోట్ల ఇప్పటికీ అందలేదని చెబుతున్నారు. విద్యాశాఖకు అనుబంధంగా సమగ్ర శిక్షా అభియాన్‌ విభాగం పనిచేస్తోంది. జిల్లా కేంద్రాల్లోని కార్యాలయాల్లో అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌, ఆడిట్‌ అధికారి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు, సెక్టోరియల్‌ అధికారులు, ఏఈలు, ఇతర ఫీల్డు ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు.

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 34 కేజీబీవీలు, మండల విద్యాశాఖ కార్యాలయాలు, స్కూలు కాంప్లెక్స్‌లో ఎంఆర్‌సీలు, సీఆర్‌పీలు వున్నారు. సమగ్ర శిక్ష విభాగం పరిధిలో 1,500 మంది సిబ్బంది ఉండగా, వీరిలో అత్యధికంగా అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నారు. వీరి జీతాలు రూ.12 వేల నుంచి రూ.23 వేల వరకు ఉంటాయి. ప్రతినెలా సకాలంలో జీతాలు రాకపోతే కుటుంబాల పోషణ ఇబ్బందిగా మారుతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి రెండో వారంలో జీతాలు అందుతున్నాయని వాపోతున్నారు. జీతాల కోసం ప్రభుత్వం ముందుగా బడ్జెట్‌ విడుదల చేస్తే జిల్లాస్థాయి అధికారులు బిల్లులు అప్‌లోడ్‌ చేస్తారు. అయితే ఇంతవరకు నవంబరు జీతాల కోసం బడ్జెట్‌ కేటాయించలేదు. ఈ నేపథ్యంలో జీతాలు అందడానికి మరింత ఎక్కువ సమయం పడుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-12T01:30:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising