ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలల్లో ఫిర్యాదు పెట్టె

ABN, First Publish Date - 2022-08-20T06:26:35+05:30

లైంగిక వేధింపులు, పోక్సో చట్టం నేరాలకు సంబంధించి పాఠ శాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేం దుకు వీలుగా ఇకపై ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటుచేయనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 లైంగిక వేధింపులు,  పోక్సో కేసుల  కోసం ఏర్పాటు

 పదిహేను రోజులకోసారి తెరిచి పరిశీలన

 ఫిర్యాదు,  ఫిర్యాదీ వివరాలు వెల్లడించరు 

భీమునిపట్నం రూరల్‌ (విశాఖపట్నం), ఆగస్టు 19: లైంగిక వేధింపులు, పోక్సో చట్టం నేరాలకు సంబంధించి పాఠ శాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేం దుకు వీలుగా ఇకపై ప్రతి పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటుచేయనున్నారు. బయటకు చెప్పుకోలేని సమస్యతో బాధపడుతున్న విద్యార్థులు, వారి తల్లిదం డ్రుల సౌకర్యార్థం ఈ ఏర్పాటుచేసి, విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలంటూ ఎస్‌పీఎల్‌-ఎస్‌సీఈఆర్‌టీ-2022 నంబరుతో విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేసింది. పాఠశాల విద్యా కమిషనర్‌  ఎస్‌.సురేష్‌ కుమార్‌ ఇందుకు సంబంధించి ఉపాధ్యాయులకు పలు సూచనలు అందజేశారు.


ఈ రెండు అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు, ఎలా చేయాలి వంటి అంశాలతో రెండు పోస్టర్లను పీడీఎఫ్‌ ఫారె ్మట్‌లో పంపుతారని, వాటిని ప్రింటుతీసి పాఠశాలలో అందరికీ కనిపించే విధంగా గోడకు అతికించాలని ఆ ఉత్త ర్వుల్లో కోరారు. ఫిర్యాదుల పెట్టెకు తాళంవేసి ఉంచాలని, విద్యార్థులు, వారి తల్లిదం డ్రులు ఎవరైనా ఈ పెట్టెలో ఫిర్యాదులు వేయొచ్చని తెలిపారు. ప్రతి పదిహేను రోజుకోసారి మహిళా పోలీసు, ఏఎన్‌ఎంల సమక్షంలో పెట్టెను తెరిచి ఫిర్యాదులు పరిశీలించాలి. ఈ పిర్యాదుల ప్రాధాన్యతను బట్టి మండల విద్యాశాఖాధికారులు ఉన్నతాధికారులకు పంపించాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఎవరు ఏ పిర్యాదు చేసారన్న విషయాన్ని రహస్యంగా ఉంచాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-20T06:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising