కాగ్నిజెంట్ నిపుణులు గీతం విశ్వవిద్యాలయం సందర్శన
ABN, First Publish Date - 2022-07-14T06:09:31+05:30
అమెరికాకు చెందిన బహుళజాతి ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ నిపుణులు బృందం బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది.
వర్సిటీ ప్రతినిధులతో చర్చలు... విద్యార్థుల సందేహాలు నివృత్తి
విశాఖపట్నం, జూలై 13: అమెరికాకు చెందిన బహుళజాతి ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ నిపుణులు బృందం బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది. సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ పి.కృష్ణ, క్యాంపస్ రిక్రూట్‌మెంట్ విభాగం ప్రాంతీయ అధికారి పి.యశ్వంత్‌లు గీతం స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ సిహెచ్.విజయశేఖర్, కెరీర్ సర్వీసెస్ సహాయ డీన్ గురుమూర్తి గంగాధరన్‌లతో సమావేశమయ్యారు.
పారిశ్రామిక అవసరాలకు అను గుణంగా సిలబస్‌లో మార్పులపై చర్చించి సూచనలు చేశారు. గీతం విద్యార్థులను ఉద్దేశించి కాగ్నిజెంట్ ఉపాధ్యక్షుడు పి.కృష్ణ ప్రసంగించారు. కార్పొరేట్ రంగం తీరు తెన్నులు, విద్యార్థులు కాలానుగుణంగా వివిధ అంశాలపై నైపుణ్యాలను పెంచుకోవడం, నాయకత్వ లక్షణాలను వివరించారు. క్యాంపస్ రిక్రూట్ మెంట్ ప్రాంతీయ అధికారి పి.యశ్వంత్ మాట్లాడుతూ గీతం నుంచి గత ఏడాది 320 మంది విద్యార్ధులకు కాగ్నిజెంట్ ఎంపిక చేసుకుందని తెలిపారు. కార్యక్రమంలో గీతం కెరీర్ గైడెన్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - 2022-07-14T06:09:31+05:30 IST