ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎంఆర్‌ సంస్థ సామాజిక బాధ్యత ఆదర్శనీయం

ABN, First Publish Date - 2022-06-27T06:15:33+05:30

ప్లాస్టిక్‌ నిషేధానికి సీఎంఆర్‌ సంస్థ సామాజిక బాధ్యత, సహకారం అభినందనీయమని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా అన్నారు.

గుడ్డ సంచులు పంపిణీ చేస్తున్న కమిషనర్‌ లక్ష్మీషా, సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ లక్ష్మీషా

విశాఖపట్నం, జూన్‌ 26: ప్లాస్టిక్‌ నిషేధానికి సీఎంఆర్‌ సంస్థ సామాజిక బాధ్యత, సహకారం అభినందనీయమని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీషా అన్నారు. మద్దిలపాలెంలోని  సీఎంఆర్‌ సెంట్రల్‌లో ప్లాస్టిక్‌ నిషేధంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్‌ నిర్మూలనకు  ‘మేము సైతం’ అంటూ నగరవాసుల స్పందన సంతోషాన్నిస్తోందన్నారు. వీరితోపాటు పలు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారం స్ఫూర్తిదాయకమని చెప్పారు.


ఇప్పటికే నగరవాసులు ప్లాస్టిక్‌ను స్వచ్ఛందంగా విడనాడుతున్నారని, దీన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ విశాఖ అంబాసిడర్‌, సీఎంఆర్‌ అధినేత  మావూరి వెంకటరమణ ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’కు అందించిన స్థాయిలో ప్లాస్టిక్‌ నిషేధానికి సహకరించడాన్ని ప్రశంసించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను ఎవరైనా తీసుకు వస్తే వారికి నగదు చెల్లిస్తామని సీఎంఆర్‌ సంస్థ చెప్పడం గొప్ప నిర్ణయమన్నారు.


సీఎంఆర్‌ సంస్థ అధినేత మావూరి వెంకటరమణ మాట్లాడుతూ ప్లాస్టిక్‌  భూతాన్ని తరిమి కొట్టడానికి జీవీఎంసీ కమిషనర్‌ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని కొనియాడారు. నగరవాసుల సేవకు సీఎంఆర్‌ సంస్థలు ఎప్పుడూ సిద్ధమని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్‌.ఎల్‌.జి.శాస్ర్తి, జోనల్‌ కమిషనర్‌ శివప్రసాద్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-27T06:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising