ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాతవరంపై పాలకులు చిన్నచూపు

ABN, First Publish Date - 2022-03-05T06:17:16+05:30

మండల కేంద్రం నాతవరంలో పలు ప్రధాన సమస్యలు ఏళ్లతరబడి పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

ఇరుకుగా వున్న నాతవరం మెయిన్‌రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు

విస్తరణకు నోచుకోని మెయిన్‌ రోడ్డు

నిత్యం స్తంభిస్తున్న ట్రాఫిక్‌

ప్రతిపాదనలకే పరిమితమైన జూనియర్‌ కాలేజీ ఏర్పాటు

పదో తరగతితోనే చదువు ఆపేస్తున్న పలువురు బాలికలు, పేద విద్యార్థులు

నిరుపయోగంగా ‘సంపద’ కేంద్రం.. మెయిన్‌ రోడ్డు పక్కన చెత్త డంపింగ్‌


నాతవరం మార్చి 4: మండల కేంద్రం నాతవరంలో పలు ప్రధాన సమస్యలు ఏళ్లతరబడి పరిష్కారానికి నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజాప్రతినిధులు నర్సీపట్నం నియోజకవర్గంలో మిగిలిన మూడు మండలాల్లో అభివృద్ధి పనులపై చూపిస్తున్న శ్రద్ధ తమ మండలంలో చూపడంలేదని ఆరోపిస్తున్నారు. దీంతో సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కావడంలేదని వాపోతున్నారు. సుమారు పది వేల జనాభా ఉన్న పంచాయతీలో గతంలో నిర్మించిన ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం’ నిరుపయోగంగా పడివుంది. దీంతో చెత్తాచెదారాన్ని మెయిన్‌ రోడ్డు పక్కన పడేస్తున్నారు. గ్రామంలోని మూడు ప్రధాన రహదారులు ఇరుకుగా వుండడం, విస్తరణకు నోచుకోకపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా వుంది. పలు వీధుల్లో తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయలేదు. ఇక ముఖ్యంగా జూనియర్‌ కాలేజీ ఏర్పాటు చేయకపోవడంతో పదో తరగతి తరువాత చాలా మంది విద్యార్థులు.. ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మానేయాల్సి వస్తున్నది.


విస్తరణకు నోచుకోని మెయిన్‌ రోడ్డు

నాతవరంలో మూడు ప్రధాన రహదారులు (తాండవ జంక్షన్‌, కోటనందూరు, చమ్మచింత వైపు వెళ్లే రోడ్లు) విస్తరణకు నోచుకోకపోవడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్య తెలత్తుతున్నది. ఎదురెదురుగా రెండు లారీలు లేదా బస్సులు వస్తే తప్పుకోవడానికి వీలుకాని పరిస్థితి.  ముఖ్యంగా ఉదయం ఎనిమిది నుంచి పది గంటలు, సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనాల రద్దీ అధికంగా వుంటుంది. 


ప్రతిపాదనల్లోనే జూనియర్‌ కాలేజీ

నియోజకవర్గంలో మాకవరపాలెం, గొలుగొండ, నర్సీపట్నం మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఉండగా నాతవరంలో మాత్రం ఇంతవరకు కాలేజీ ఏర్పాటు చేయలేదు. దీంతో పదో తరగతి తరువాత విద్యార్థులు ఉన్నత విద్య కోసం నర్సీపట్నం వెళ్లాల్సి వస్తున్నది. ఆర్థిక స్థోమత లేని కుటుంబాల విద్యార్థులు, ఆడపిల్లలు అంతదూరం వెళ్లలేక చదువు మానేస్తున్నారు. కాగా గత టీడీపీ హయాంలో జూనియర్‌ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని చూడడంతోపాటు కాలేజీ ఏర్పాటుకు ఫైల్‌ తయారు చేసి ఇంటర్మీడియట్‌ బోర్డుకు పంపారు. సొంత భవనాలు నిర్మించే వరకు హైస్కూల్‌ భవనంలో జూనియర్‌ కాలేజీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ప్రభుత్వం మారిపోవడంతో కాలేజీ ఏర్పాటు మరుగున పడింది. కాగా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులు గత ఏడాది జూలైలో స్థానిక హైస్కూల్‌ని సందర్శించి, జూనియర్‌ కాలేజీ ఏర్పాటుకు అవసరమైన వసతి, సైన్స్‌ ల్యాబ్‌, మరుగుదొడ్లు వున్నాయని, తరగతులు ప్రారంభించవచ్చని ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ ఇంతవరకు కాలేజీ ఏర్పాటు కాలేదు.


నిరుపయోగంగా ‘సంపద కేంద్రం’

నాతవరం పంచాయతీలో సుమారు ఐదేళ్ల క్రితం రూ.20 లక్షలు వెచ్చించి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. కొద్ది నెలలపాటు ఇళ్ల నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి ఈ కేంద్రానికి తరలించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రీన్‌ అంబాసిడర్లకు (చెత్త తరలించే కార్మికులు) వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులకు రావడంలేదు. దీంతో గ్రామంలో సేకరించిన చెత్తను మెయిన్‌రోడ్డు పక్కనే డంపింగ్‌ చేస్తున్నారు. ఇది కుళ్లిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్నది. 


డ్రైనేజీ, తాగునీటి సమస్యలు

స్థానిక వైఎస్సార్‌ కాలనీలోని పలు వీధుల్లో తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ కాలువలు అస్తవ్యస్తంగా వుండడంతో ఎక్కడికక్కడ మురుగునీరు నిలిచిపోతున్నది. దీంతో దోమల బెడద అధికంగా వుంది. 


Updated Date - 2022-03-05T06:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising