ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లేస్‌మెంట్‌, ట్రావెల్‌ ఏజెన్సీలపై సీఐడీ కన్ను

ABN, First Publish Date - 2022-05-15T06:34:10+05:30

నగరంలోని ట్రావెల్‌, ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీలపై సీఐడీ అధికారులు దృష్టిసారించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నింటిపై ఫిర్యాదులు అందడమే కారణం

రికార్డులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్న అధికారులు


విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని ట్రావెల్‌, ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీలపై సీఐడీ అధికారులు దృష్టిసారించారు. ఆయా ఏజెన్సీల రికార్డులను స్వాధీనం చేసుకుని, పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని ఏజెన్సీలపై సీఐడీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో నగరంలో గల సంస్థలపై ఆరా తీశారు. విదేశాల్లో ఉద్యోగాలు, యూనివర్సిటీల్లో సీట్లు ఇప్పిస్తామంటూ కొన్ని ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటుచేశాయి. మరికొన్ని ఏజెన్సీలు విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ప్రయాణ ఏర్పాట్లు చేయడంతోపాటు వీసా ఇప్పించేలా ఒప్పందాలు చేసుకుంటాయి. అయితే కొన్ని ఏజెన్సీలు డబ్బులు తీసుకుని మోసం చేశాయంటూ సీఐడీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. దీంతో రాష్ట్రంలో ట్రావెల్‌, ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలని జిల్లాల్లోని సీఐడీ కార్యాలయాలకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు విశాఖ సీఐడీ అధికారులు నగరంలో గల ట్రావెల్‌, ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీలకు వెళ్లి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 

ఈ రెండు కేటగిరీల్లో నగరంలో సుమారు 22 ఏజెన్సీలు వున్నాయని సీఐడీ అధికారులు గుర్తించారు. వాటికి రిజిస్ర్టేషన్లు, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా? లేదా?..అనేది పరిశీలించడంతోపాటు ఇంతవరకూ ఎంతమందిని ఏఏ దేశాలకు పంపించారు?, వారిలో ఉద్యోగులు ఎందరు?, విద్యార్థులు ఎందరు?, వారి నుంచి ఎంతమొత్తంలో ఫీజులు వసూలు చేశారు?, వారిని చట్టబద్ధంగానే విదేశాలకు పంపించారా?......వంటి సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలిసింది. ఈ విషయం సీఐడీ అధికారుల వద్ద ప్రస్తావించగా, ఆ వివరాలను బయటకు వెల్లడించలేమని సమాధానం ఇచ్చారు.


ఇంటర్‌ పరీక్షల్లో ముగ్గురు డీబార్‌

మద్దిలపాలెం, మే 14: ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ పరీక్షల్లో శనివారం ముగ్గురు విద్యార్థులు డీబార్‌ అయ్యారు. మద్దిలపాలెంలోని డాక్టర్‌ వీఎస్‌ కృష్ణా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వీరు మాథ్స్‌-2 పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండుగా అధికారులు పట్టుకున్నారు. ఒకే కేంద్రంలోని ఒకే పరీక్ష గదిలో ముగ్గురు విద్యార్థులు డీబార్‌ కావడం విశేషం. వీరు కార్పొరేట్‌ కళాశాలలకు చెందిన విద్యార్థులుగా ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-05-15T06:34:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising