ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చౌడువాడలో పులి సంచారం

ABN, First Publish Date - 2022-08-10T06:15:12+05:30

మండలంలోని చౌడువాడలో పులి అలజడి సృష్టించింది. మంగళవారం వేకువజామున ఎదురు అప్పలనర్సకు చెందిన ఆవును చంపి తినేసింది.

మృతి చెందిన ఆవు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- పంజాకు బలైన ఆవు 

కె.కోటపాడు, ఆగస్టు 9: మండలంలోని చౌడువాడలో పులి అలజడి సృష్టించింది. మంగళవారం వేకువజామున ఎదురు అప్పలనర్సకు చెందిన ఆవును  చంపి తినేసింది. అటవీశాఖ అధికారులకు సర్పంచ్‌ దాడి ఎరుకునాయుడు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పులి దాడి చేసినట్టు గుర్తించారు. నల్లగొండ ప్రాంతాన్ని పులి వదిలి పెట్టడం లేదు. ఎల్లుప్పి  ప్రాంతంలో శనివారం రాత్రి రెండు ఆవులను చంపి మరో గేదెపై దాడి చేసిన విషయం తెలిసిందే. గ్రామాలకు దూరంగా, అడవులకు దగ్గరగా ఉండే పశువుల పాకలపై దాడి చేసి ఆవులను చంపుతోంది. అది మళ్లీ దిశ మార్చుకుని చౌడువాడ వైపు వచ్చింది. రోజుకో మండలంలో తిరుగుతూ అటవీ అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. పశువులను గ్రామాలకు దూరంగా ఉంచవద్దని రైతులకు అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. కాగా పులిని బంధించడంలో అటవీ శాఖ అధికారులు విఫలమవుతున్నారని సర్పంచ్‌ ఎరుకునాయుడు ఆరోపించారు. పశువులను పులి చంపిన తరువాత ఆ ప్రాంతాన్ని సందర్శించి వెళుతున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Updated Date - 2022-08-10T06:15:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising