ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న ఉద్యోగమైనా వదులుకోవద్దు

ABN, First Publish Date - 2022-09-17T06:24:32+05:30

గిరిజన నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు.

జాబ్‌ మేళాలో మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి 

జాబ్‌ మేళాలో జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ 

1,620 మంది గిరిజన యువత హాజరు

ఉద్యోగాలకు 314 మంది ఎంపిక 


పాడేరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): గిరిజన నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగాజాబ్‌ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, చిన్నపాటి ఉద్యోగానికి కూడా పోటీ అధికంగా వుందని, అందువల్ల తక్కువ జీతమనో, దూర ప్రాంతమనో... వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోవద్దని సూచించారు. తొలుత ఉద్యోగంలో చేరి, విధి నిర్వహణలో నైపుణ్యాన్ని మెరుగుపరచుకుని, తద్వారా ఉన్నతస్థాయికి చేరాలని పిలుపునిచ్చారు. 11 ప్రైవేటు కంపెనీల్లో 770 పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ఈ జాబ్‌ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరారు.  

జాబ్‌మేళాకు 1,620 మంది హాజరు

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు 1,620 మంది అభ్యర్థులు హాజరయ్యారు. విద్యార్హతలు, ప్రతిభ, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని, 314 మందిని వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేశారు. వీరికి ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ నియామక ఉత్తర్వులను అందజేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పీ కె.సతీశ్‌కుమార్‌, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారిణి రోషిణి, జిల్లా ఉపాధి కల్పనాధికారి సంగీత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు. 




Updated Date - 2022-09-17T06:24:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising