ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెట్టు కింద వైద్య సేవలు!

ABN, First Publish Date - 2022-09-08T06:46:22+05:30

గ్రామ సచివాలయాల పరిధిలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేజరు పంచాయతీ తుమ్మపాలలో నీరుగారుతున్నది.

తుమ్మపాలలో రోడ్డు పక్కన చెట్టు కింద వైద్యసేవలు అందిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సొంతగూడుకు నోచుకోని విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌

స్థల సేకరణ చేపట్టని పంచాయతీ అధికారులు

ఆరు బయట వైద్యంతో ఇబ్బంది పడుతున్న సిబ్బంది, రోగులు


తుమ్మపాల, సెప్టెంబరు 7: గ్రామ సచివాలయాల పరిధిలో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేజరు పంచాయతీ తుమ్మపాలలో నీరుగారుతున్నది. ఆస్పత్రికి వసతి లేకపోవడంతో ఆరుబయట రోడ్డుపక్కన వైద్య సేవలను అందిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా, వర్షం కురిసినా  వైద్య సిబ్బంది, రోగులు ఇబ్బంది పడుతున్నారు. 

తుమ్మపాల పంచాయతీ పరిధిలోని సచివాలయం-2లో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.17.5 లక్షలు మంజూరు చేసింది. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పంచాయతీ అధికారులు ఇంతవరకు చేపట్టలేదు. దీంతో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సిబ్బంది సచివాలయం పరిధిలో ఒక్కో రోజు ఒక్కో వీధికి వెళ్లి సంచార వైద్య సేవలు అందిస్తున్నారు. చెట్ల కింద, రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో, ఆలయాల వద్ద  వైద్యపరికరాలు, మందులను బల్లపై పెట్టుకుని రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. వైద్యం కోసంవచ్చే రోగులు కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. పంచాయతీ అధికారులు ఇప్పటికైనా స్పందించి విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌కు స్థల సేకరణ చేపట్టి భవన నిర్మాణ పనులను ప్రారంభించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


Updated Date - 2022-09-08T06:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising