ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చలో విజయవాడ’ను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-08-19T06:45:09+05:30

పాత పింఛన్‌ను పునరుద్ధరించాలన్న ఏకైక డిమాండ్‌తో సీపీ ఎస్‌ ఉద్యోగులు సెప్టెంబరు ఒకటవ తేదీన తలపెట్టిన చలో విజయవాడ ఆందోళన విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సతీష్‌ పిలుపునిచ్చారు.

చోడవరంలో చలో విజయవాడ ఆందోళనపోస్టర్లను ఆవిష్కరిస్తున్న సీపీఎస్‌ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు కోరుకొండ సతీశ్‌

చోడవరం, ఆగస్టు 18: పాత పింఛన్‌ను పునరుద్ధరించాలన్న ఏకైక డిమాండ్‌తో సీపీ ఎస్‌ ఉద్యోగులు సెప్టెంబరు ఒకటవ తేదీన తలపెట్టిన చలో విజయవాడ ఆందోళన విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకొండ సతీష్‌ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కొత్తూరు బాలికల హైస్కూల్‌ ఆవరణలో చలో విజయవాడకు సంబంధించి గోడపత్రికను ఆవిష్కరిం చిన అనంతరం సీపీఎస్‌ ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ రద్దు చేసేంత వరకూ రాజీలేని పోరాటం సాగిస్తామన్నారు. చలో విజయవాడతో ప్రభుత్వానికి సీపీఎస్‌ ఉద్యోగుల ఆవేదనను తీసుకు వెళతామన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులంతా ఈ ఆందోళనకు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. జగన్‌ పాదయాత్రలో సీపీఎస్‌ రద్దుపై ఇచ్చిన హామీని అమలు చేయాలని తాము కోరుతున్నామని, ప్రత్యామ్నాయ పెన్షన్‌ విధానాల ప్రతిపాదనలకు తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు జి.సింహాద్రి, భరత్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు ఆర్‌. చిరంజీవి, పీఆర్‌ టీయూ నాయకులు జయప్రకాశ్‌, యూటీఎఫ్‌ నాయకులు శ్రీను ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.  

సీపీఎస్‌ను రద్దు చేయాలి

దేవరాపల్లి: సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబరు ఒకవ తేదీన చేపట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీసీపీఎస్‌ఈఏ   జిల్లా అద్యక్షుడు కోరుకొండ సతీష్‌ కోరారు. గురువారం మండల విద్యా శాఖ కార్యాలయం వద్ద వారు గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్‌ భిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నాయకులు చిరికి సింహాచలం నాయుడు, కొటాన కోటి, జి సింహాద్రి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T06:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising