ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం ఆమోదంతో టెండర్లలో పాల్గొనవచ్చు

ABN, First Publish Date - 2022-11-23T03:16:15+05:30

కేంద్ర ఇంధనశాఖ ఆమోదం పొందితే మీటర్ల టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు వివరణ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై ఎపీఎస్పీడీసీఎల్‌ వివరణ

అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఇంధనశాఖ ఆమోదం పొందితే మీటర్ల టెండర్లలో పాల్గొనే అవకాశం ఉందని ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు వివరణ ఇచ్చారు. ‘‘అస్మదీయులకేనా మీటర్లు’’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. స్మార్ట్‌ మీటర్ల టెండర్ల ప్రక్రియలో స్పెక్ట్రమ్‌ ఆఫ్‌ బిడ్డర్స్‌ను మాత్రమే ఆహ్వానిస్తున్నామనడం సరికాదని చెప్పా రు. కేంద్ర ఇంధనశాఖ నిబంధనల మేరకే టెండరు మార్గదర్శకాలు రూపొందించామన్నారు. కేంద్ర ఇంధనశాఖ ఆర్‌ఈసీ వెబ్‌సైట్‌లో కాంట్రాక్టు సంస్థలు దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా గడువు ఉందన్నారు. 29 సంస్థలు ఈఆర్‌సీ ఆమోదం పొందాయని సంతోషరావు వెల్లడించారు. ఎపీఎస్పీడీసీఎల్‌లో కన్జుమర్‌ గ్రీవెన్సెస్‌ రిడ్రెసల్‌ ఫోరం చైర్మన్‌ నియామకం నిబంధన మేరకే జరుగుతుందని సీఎండీ సంతోషరావు వివరించారు. ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన ‘‘మనోడికే ఇచ్చేద్దాం చాన్స్‌’’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై ఆయ న స్పందించారు. ఏపీఈఆర్‌సీ ఆదేశాల మేరకే సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ నియామకం చేపడుతున్నామని వెల్లడించారు. దీనికోసం ఆగస్టు 21న దినపత్రికల్లో ప్రకటన జారీ చేశామన్నారు.

Updated Date - 2022-11-23T03:16:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising