ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

BV Raghavulu: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ..

ABN, First Publish Date - 2022-08-12T18:05:25+05:30

స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ వేసిందని సీపీఎం నేత బీవీ రాఘవులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ (Visakha): స్టీల్ ప్లాంట్‌ (Steel plant)పై కేంద్రం ఇప్పుడు మరో ఎత్తు గడ వేసిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు (BV Raghavulu) అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఉత్పత్తి తగ్గించి, నష్టాలు చూపి స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం (BJP Govt.) కార్పొరేట్లను కొమ్ము కాస్తోందని విమర్శించారు. టీడీపీ (TDP) మినీ మహానాడులో, వైసీపీ ప్లీనరీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఎందుకు తీర్మానాలు చెయ్యలేదని ప్రశ్నించారు. 


ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla) రాసలీలల వ్యవహరంలో వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) ఉదాసీనంగా ఉందని రాఘవులు విమర్శించారు. ఎస్పీ మీడియా సమావేశం దీనిని నిరుగార్చేలా ఉందన్నారు. గోరంట్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ లాబ్‌కు రిపోర్ట్ లేకుండా, అది ఫేక్ అని ఎలా చెబుతారని ప్రశ్నించారు. దేశమంతా ఒకటే పన్ను, ఒకటే ఎన్నిక, ఒకటే మాట, అనే నియంతృత్వ ధోరణిలో వెళ్తోందని, అది దేశానికి ప్రమాదమని అన్నారు. ఉచితాలు సంక్షేమంపై చర్చ జరిగేలా కేంద్రమే చేస్తోందని ఆరోపించారు. చైనా దూకుడు, దేశ రక్షణ విషయంలో ప్రధాని మాటలపై తమకు నమ్మకం ఉందన్నారు. ఆజాద్ కా అమృత్ ఉత్సవ్ కాదు.. ఆజాద్ కా సంకల్ప ఉత్సవ్ నిర్వహించాలన్నారు. జగన్ సర్కార్ విపరీతమైన అప్పులు చేస్తోందని బీవీ రాఘవులు అన్నారు.

Updated Date - 2022-08-12T18:05:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising