8వ తరగతి విద్యార్థి దారుణ హత్య
ABN, First Publish Date - 2022-10-17T06:54:07+05:30
పశువులను మేతకు తోలుకెళ్లిన 8వ తరగతి చదువుతున్న బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి మెడకు వైర్లు చుట్టి, ఉరివేసి చంపేశారు.
పశువులను మేతకు తోలుకెళ్లిన బాలుడు
మెడకు విద్యుత్ వైర్లు చుట్టి చంపేసిన వైనం
అనకాపల్లి జిల్లాలో దారుణం
రోలుగుంట, అక్టోబరు 16: పశువులను మేతకు తోలుకెళ్లిన 8వ తరగతి చదువుతున్న బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు బాలుడి మెడకు వైర్లు చుట్టి, ఉరివేసి చంపేశారు. రోలుగుంట మండలం పడాలపాలెంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు...
రోలుగుంట మండలం పడాలపాలెం గ్రామానికి చెందిన పెద్దాడ సురేష్ (13) కొమరవోలు జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో ఉదయం 11 గంటల సమయంలో పశువులను మేతకు తోలుకెళ్లాడు. సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు రాము, సత్యవతి, కుటుంబ సభ్యులతో కలిసి చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టారు.
రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారున మరిడిమాంబ గుడి సమీపంలో కర్ర, చెప్పులు, తువ్వాలు కనిపించాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులో సమీపంలో వెతగ్గా తుప్పల్లో సురేష్ మృతదేహం కనిపించింది. మెడకు కరెంటు వైర్లు బిగించి వున్నాయి. గుర్తు తెలియని దుండగులు విద్యుత్ వైర్లను మెడకు చుట్టి, ఉరివేసి హత్య చేసి వుంటారని తల్లిదండ్రులు, బంధువులు అనుమానిస్తున్నారు. బాలుడి తండ్రి రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ నాగకార్తీక్ తెలిపారు.
Updated Date - 2022-10-17T06:54:07+05:30 IST