ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డాది వంతెన మరమ్మతులు ప్రారంభం

ABN, First Publish Date - 2022-12-16T23:54:23+05:30

మండలంలోని వడ్డాది వంతెన మరమ్మతు పనులను శుక్రవారం రాత్రి గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ సీడీఓ రామం ప్రారంభించారు.

వడ్డాది వంతెన మరమ్మతు పనులు ప్రారంభించిన గోవాడ సీడీఓ రామం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుచ్చెయ్యపేట, డిసెంబరు 16: మండలంలోని వడ్డాది వంతెన మరమ్మతు పనులను శుక్రవారం రాత్రి గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ సీడీఓ రామం ప్రారంభించారు. మే నెలలో వంతెనకు చెందిన నాలుగు ఖానాలు దెబ్బతినడంతో రాకపోకలు నిలిచిన విషయం తెలిసిందే. ఈ వంతెనపై నుంచి గోవాడ ఫ్యాక్టరీకి 70 వేల టన్నుల చెరకు రవాణా కావలసి ఉంది. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం నిలిచిన రవాణా పునఃరుద్ధరణకు రూ.6 లక్షలు మంజూరు చేసింది. ప్రస్తుతం నాలుగు ఖానాల మధ్య ఉన్న బండ రాళ్లును ఇరువైపులా వేసి వెడల్పు చేయడం, వంతెన ఖానాల మధ్య కొత్తగా పెద్ద గ్రానైట్‌ రాళ్లు పేర్చడం ద్వారా వంతెన సామర్థ్యం పెంచడానికి పనులు చేపట్టామని ఫ్యాక్టరీ సీడీఓ రామం తెలిపారు. ఈ పనులకు నాలుగు రోజు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీ కేన్‌ ఇన్‌స్పెక్టర్‌ మధు, టీడీపీ చోడవరం నియోజవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగిరిశెట్టి చినవెంకయ్యదొర, మాజీ వైస్‌ ఎంపీపీ దాడి సూర్యనాగేశ్వరరావు, సర్పంచ్‌ కోరుకొండ కామలక్ష్మి, వైసీపీ వడ్డాది పట్టణ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:54:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising