ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువుల కళ్లాల వద్ద బోర్లు

ABN, First Publish Date - 2022-07-02T06:25:14+05:30

రైతుల కళ్లాల వద్ద బోర్లు వేయిస్తామని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక పాలకేంద్రం నూతన భవనాన్ని విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనందబాబుతో కలిసి ఉపముఖ్య మంత్రి ప్రారంభించారు.

పాలకేంద్ర భవనాన్ని ప్రారంభిస్తున్న ఉపముఖ్యమంత్రి బూడి, ఆనందబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు 

చీడికాడ, జూలై 1: రైతుల కళ్లాల వద్ద బోర్లు వేయిస్తామని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. శుక్రవారం స్థానిక పాలకేంద్రం నూతన భవనాన్ని విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనందబాబుతో కలిసి ఉపముఖ్య మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గ్రామాల్లో ప్రస్తుతం మంచి నీటి బోర్లు అవసరం లేదన్నారు. పశువుల కళ్లాలు వద్ద నాలుగు లేక ఐదు పాకలు ఉన్నచోట పశువులకు దాహార్తిని తీర్చేందుకు బోర్లు ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి విశాఖ డెయిరీ కొంత సహాయం అందిస్తుందన్నారు. పాలుపోస్తున్న రైతులకు పేమెంట్‌లతోపాటు విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నదన్నారు. పాడిఉత్పత్తి పెంచుతూ డెయిరీసేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు. విశాఖ డెయిరీ వైస్‌చైర్మన్‌ ఆడారి ఆనందబాబు మాట్లాడుతూ, పాడి రైతులకు తగిన ప్రతిఫలం అందిస్తామన్నారు. గేదె పాల సేకరణ ధర లీటరుకు రూ.రెండు, ఆవు పాలకు లీటరు రూ. మూడు పెంచుతున్నట్టు చెప్పారు. ఈ నెల నుంచే ఈ ధరలు అమలులోకి వస్తాయన్నారు. చీడికాడలో నలుగురు రైతులకు పశువుల షెడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అలా విశాఖ డెయిరీ పరిధిలో అర్హులైన రైతులందరికీ ఈ సౌకర్యం కల్పిస్తామన్నారు. స్థానిక పాలసంఘం అధ్యక్షుడు బొబ్బిలి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశాఖ డెయిరీ డైరెక్టర్‌ శీరంరెడ్డి సూర్యనారాయణ, వ్యవసాయ సలహా కమిటీ చైర్‌పర్సన్‌ యర్రా అప్పారావు, సర్పంచ్‌ గాలి సామాలమ్మ, వైసీపీ నాయకులు గొల్లవిల్లి రాజబాబు, లాలం జానకిరామ్‌, గొల్లవిల్లి స్వామినాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:25:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising