భీమిలి ఆర్డీవో కార్యాలయం నేడే ప్రారంభం
ABN, First Publish Date - 2022-04-04T06:10:42+05:30
భీమిలి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భీమునిపట్నం, ఏప్రిల్ 3: భీమిలి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సోమవారం ప్రారంభిం చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో భీమిలి ఆర్డీవో డివిజన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు భీమిలి మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో కొత్తగా నిర్మించినభవనంలో ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించేందుకు తహసీల్దార్ కేవీ ఈశ్వరరావు ఆధ్వర్యంలో సన్నాహాలు చేస్తున్నారు. ఈ డివిజన్‌లో తొలుత భీమిలి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ రూరల్, మహారాణిపేట మండలాలను చేర్చారు. అయితే నగరంలో కలెక్టరేట్ వున్నందున మహారాణిపేట మండలాన్ని విశాఖ డివిజన్‌లోనే వుంచి.. ఆ స్థానంలో సీతమ్మధార మండలాన్ని చేర్చారు. కాగా భీమిలి తొలి ఆర్డీవోగా ఎస్.భాస్కర్‌రెడ్డిని ప్రభుత్వం నియమించింది. సోమవారం ఉదయం జరిగే కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ మల్లికార్జున, జేసీ కేఎస్ విశ్వనాథన్, తదితర అధికారులు హాజరవుతారని తహసీల్దార్ తెలిపారు. ఇప్పటివరకు ఆర్డీవో కార్యాలయ పనుల నిమిత్తం భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల ప్రజలు విశాఖ వెళ్లేవారు. ఇప్పుడు ఈ మూడు మండలాల ప్రజలకు భీమిలిలోని కార్యాలయం అందుబాటులోకి రానున్నది.
Updated Date - 2022-04-04T06:10:42+05:30 IST