ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ ప్రారంభం

ABN, First Publish Date - 2022-06-30T06:04:04+05:30

జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల, హిందీ ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు నిర్వహించనున్న వృత్యంతర శిక్షణ బుధవారం తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది.

కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతున్న డీఈవో చంద్రకళ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి చంద్రకళ

విశాఖపట్నం, జూన్‌ 29: జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల, హిందీ ఉపాధ్యాయులకు రెండు రోజులపాటు నిర్వహించనున్న వృత్యంతర శిక్షణ బుధవారం తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి ఎల్‌.చంద్రకళ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించడానికి ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధమైన బోధన ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని సూచించారు.


మారుతున్న విద్యా ప్రమాణాలకు అనుగుణంగా 8వ తరగతి పాఠ్యపుస్తకంలోని పాఠ్యాంశాలను అవగాహన చేసుకుని పాఠశాలల పునఃప్రారంభం తర్వాత పిల్లల్ని తీర్చిదిద్దాలని సూచించారు. తొలిరోజు ఆంగ్ల పాఠ్యాంశాల బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ అందజేశారు. విద్యార్థులు పాఠశాలలకు హాజరైన తొలిరోజే జగనన్న విద్యాకానుక, పాఠ్యపుస్తకాలు అందించాలని సూచించారు. డీఈవో సాయంత్రం వరకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం.


ఈ కార్యక్రమంలో భీమిలి డైట్‌ ప్రిన్సిపాల్‌ మాణిక్యంనాయుడు, ఎస్‌ఎస్‌ఏ, ఏపీసీ అసిస్టెంట్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాసరావు అవగాహన తరగతులను పరిశీలించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచి 240 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాల హెచ్‌ఎం దుర్గాభవాని పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-30T06:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising