ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2022-05-25T06:17:29+05:30

మండలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో ఆర్‌.గోపాలక్రిష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ 

హుకుంపేట, మే 24: మండలంలో సీజనల్‌ వ్యాధుల పట్ల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు విజృంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పాడేరు ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ ఆదేశించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సీజనల్‌ వ్యాధులపై అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా వ్యాధుల కారక దోమల వ్యాప్తికి అవకాశం లేకుండా నీరు, మురుగు నిల్వలను అరికట్టాలన్నారు. అలాగే పల్లెల్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధకనబరచాలని, గ్రామాల్లో రోగాల వ్యాప్తికి అవకాశం లేకుండా పారామెడికల్‌ సిబ్బంది ముందజాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. పారామెడికల్‌ సిబ్బంది పనితీరును మండల అధికారులు పర్యవేక్షించాలని, నిర్లక్ష్యంగా ఉంటే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని పీవో హెచ్చరించారు. పర్యవేక్షణకు సంబంధించి డైలీ రిపోర్టు తమకు సమర్పించాలన్నారు. మండలంలో ఇప్పటికే పలుచోట్ల రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, వాటిని ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షించాలన్నారు. పర్యవేక్షణ లోపిస్తే నిర్మాణాల్లో నాణ్యత లోపిస్తుందన్నారు. అలాగే ఇంకా రోడ్లు అవసరమైన ప్రాంతాలను గుర్తించాలని, వాటిని నిర్మిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి పీఎస్‌.కుమార్‌, ఎంపీపీ కూడ రాజబాబు, జడ్పీటీసీ సభ్యుడు రేగం మత్స్యలింగం, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, సీనియర్‌ డాక్టర్‌ టి.విశ్వేశ్వరనాయుడు, ఎంపీడీవో సుధాచాయ,ఎంఈవో ఎస్‌.రామచంద్రరావు, ఏటీడబ్ల్యూవో ఎల్‌.రజని, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈఈ రమేశ్‌, స్థానిక సర్పంచ్‌ ఎస్‌.పూర్ణిమ పాల్గొన్నారు.


Updated Date - 2022-05-25T06:17:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising