ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భార్యపై హత్యాయత్నం

ABN, First Publish Date - 2022-12-15T00:29:13+05:30

భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన భర్తపై కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ అప్పికొండ కన్నారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పద్మనాభం, డిసెంబరు 14: భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన భర్తపై కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ అప్పికొండ కన్నారావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం... రేవిడి పంచాయతీలోని రౌతులపాలెం కాలనీకి చెందిన మజ్జి సూర్యం (34), మజ్జి పోతయ్యకు 2005లో వివాహమయింది. పోతయ్యకు భార్యపై అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 13వ తేదీన ఇంటికి వచ్చిన పోతయ్య భార్యను అకారణంగా తిడుతుండడంతో పెద్దకుమార్తె అనూష తండ్రికి ఎదురుతిరిగింది. దీంతో ఆమెను కూడా దుర్భాషలాడాడు. అదేరోజు రాత్రి 7 గంటల తరువాత పూటుగా మద్యం తాగివచ్చి భార్యను తలుపు గొళ్లెం వేయమన్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. అతనితో వాదన ఎందుకని భార్య తలుపు గొళ్లెం పెట్టి, కుమార్తెలకు గోరింటాకు పెడుతుండగా వెంట తెచ్చుకున్న కత్తితో సూర్యంపై దాడి చేశాడు. దీంతో ఆమె ఎడమ చేయికి, వేలు, కాలికి, పెద్ద కుమార్తెకు గాయాలయ్యాయి. ఈలోగా భార్య తలుపు గొళ్లెం తీయడంతో నిందితుడు పరారయ్యాడు. సూర్యం ఫిర్యాదు మేరకు సీఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో గాలిస్తున్నామన్నారు.

Updated Date - 2022-12-15T00:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising