కళలు మన సంస్కృతికి ప్రతిబింబం
ABN, First Publish Date - 2022-12-07T23:48:54+05:30
కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని భీమిలి ప్రభుత్వ డైట్ కళా శాల ప్రిన్సిపాల్ యు. మాణిక్యంనాయుడు అన్నారు. కళా ఉత్సవ్‌లో భాగంగా బుధవారం విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు.
భీమునిపట్నం, డిసెంబరు 7 : కళలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబాలని భీమిలి ప్రభుత్వ డైట్ కళా శాల ప్రిన్సిపాల్ యు. మాణిక్యంనాయుడు అన్నారు. కళా ఉత్సవ్‌లో భాగంగా బుధవారం విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. ఏకపాత్రాభినయం, శాస్త్రీయ సంగీతం, ఇండోజినెస్ టాయ్స్ తయారీ తదితర విభాగాల్లో జరిగిన పోటీ లకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 56 మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రతి విభాగంలోనూ మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన వారు ఈనెల 12వ తేదీన అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. విజేతలంతా కళల్లో మరింత నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుని అక్కడి పోటీల్లో గెలుపొందాలని ఆకాంక్షించారు. పోటీల కోఆర్డినేటర్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎల్. సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు కళలకు వున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని చదువుతో పాటు కళలపై కూడా మక్కువ పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు జీజీఎస్ నాగేశ్వరరావు, షేక్ అల్లా ఉద్దీన్, ఎస్. త్రినాథరావు, జె. మాధవి, పి. హారిణి, గొట్టేటి రవి, పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:49:03+05:30 IST