ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్మీ ర్యాలీకి ఏర్పాట్లు

ABN, First Publish Date - 2022-08-13T06:49:53+05:30

వన్‌టౌన్‌లో ఇందిరాప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆర్మీ అగ్నిపథ్‌ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీలో పాల్గొనేందుకు అభ్యర్థులు శనివారం సాయంత్రం నుంచి వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు.

బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి అర్ధరాత్రి నుంచి ఎంపికకు శ్రీకారం

విశాఖపట్నం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వన్‌టౌన్‌లో ఇందిరాప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆర్మీ అగ్నిపథ్‌ ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీలో పాల్గొనేందుకు అభ్యర్థులు శనివారం సాయంత్రం నుంచి వేదిక ప్రాంగణానికి చేరుకుంటారు. అడ్మిట్‌ కార్డు ద్వారా లోపలకు అనుమతించిన అభ్యర్థులను బృందాలుగా చేసి ప్రత్యేకించి ఏర్పాటు చేసిన బాక్సుల్లోకి పంపిస్తారు. అర్ధరాత్రి ఒంటి గంట తరువాత ర్యాలీ ప్రారంభం కానున్నది. తొలి రోజు నాలుగు వేల మంది అభ్యర్థులు రానున్నారు. ఆదివారం నుంచి రోజుకు ఐదువేల మంది వరకు హాజరవుతారని అంచనా. అభ్యర్థులను స్టేడియంకు పడమర వైపు రోడ్డు నుంచి లోపలకు అనుమతించనున్నారు. ర్యాలీ కోసం అన్ని శాఖల అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మైదానంలో ర్యాలీకి అవసరమైన బారికేడ్లు, బాక్సులను రోడ్లు భవనాల శాఖ ఏర్పాటు చేసిందని డీఈ ఫణి తెలిపారు. 

బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ

ఆర్మీ నియామక ర్యాలీ బందోబస్తు ఏర్పాట్లను శుక్రవారం నగర పోలీసు కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ పరిశీలించారు. ఈ ర్యాలీ సవ్యంగా నిర్వహించేందుకు 450 మందితో బందోబస్తును ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. మొదటి రోజు 2700 మంది అభ్యర్థులు పాల్గొంటారని తెలిపారు.


Updated Date - 2022-08-13T06:49:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising