ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంద్రాగస్టుకు పక్కా ఏర్పాట్లు

ABN, First Publish Date - 2022-08-10T06:27:09+05:30

అనకాపల్లి జిల్లా ఏర్పడిన తరువాత మొట్ట మొదటిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ భారీగా నిర్వ హించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు.

ఆర్డీవోకు సూచనలిస్తున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  అధికారులకు కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశం

ఎన్టీఆర్‌ స్టేడియాన్ని పరిశీలించి పలు సూచనలు

అనకాపల్లిటౌన్‌, ఆగస్టు 9 : అనకాపల్లి జిల్లా ఏర్పడిన తరువాత మొట్ట మొదటిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఇక్కడ భారీగా నిర్వ హించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్‌ స్టేడియాన్ని మంగళవారం కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి పరిశీలించారు. ఏర్పాట్లు ఏ విధంగా చేపట్టాలో ఆర్డీవో చిన్నికృష్ణకు సూచించారు. మొత్తం స్టేడియాన్ని రోలింగ్‌ చేయించాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. స్టాల్స్‌, స్టేజ్‌, పరేడ్‌ నిర్వహణ, శకటాల ప్రదర్శ నకు అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. స్టేడియం భవనానికి కొత్తగా రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కనకమహాలక్ష్మికి సూచించారు. ఆయన వెంట డీఆర్‌వో వెంకటరమణ, ఆర్డీవో చిన్నికృష్ణ, ఆర్‌అండ్‌బీ డీఈ ధనుంజయ్‌, ఏఈ ప్రభు, ఇన్‌చార్జి తహసీల్దార్‌ శ్రీరామ్మూర్తి తదితరులున్నారు. 

Updated Date - 2022-08-10T06:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising