ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్‌

ABN, First Publish Date - 2022-10-07T06:07:14+05:30

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయిలను పెండింగ్‌లో పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు నెలల నుంచి ఆస్పత్రులకు విడుదల కాని బకాయిలు

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ పరిధిలో 70కుపైగా ప్రైవేటు/కార్పొరేటు ఆస్పత్రులు

ఒక్కో ఆస్పత్రికి రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ బకాయి

యాజమాన్యాల గగ్గోలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయిలను పెండింగ్‌లో పెట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో 70కు పైగా ప్రైవేటు/కార్పొరేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో ఉన్నాయి. ఆయా ఆస్పత్రుల్లో ప్రతి నెలా 50 నుంచి వెయ్యి మంది వరకు చికిత్స పొందుతుంటారు. ఇందుకోసం ప్రభుత్వం కనిష్ఠంగా రూ.20 లక్షల నుంచి రూ.కోటిన్నర వరకు చెల్లిస్తుంటుంది. గతంలో ఆస్పత్రులకు నాలుగైదు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉండేవి. అయితే కొంతకాలం ఏ నెలకు ఆ నెల బిల్లులు చెల్లిస్తూ  వచ్చిన ప్రభుత్వం...మళ్లీ రెండు నెలలు దాటి మూడో నెల దాదాపు పూర్తి కావస్తున్నా బకాయిలు క్లియర్‌ చేయకపోవడంతో ఆస్పత్రుల యాజమాన్యాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


బకాయి ఎక్కువే.. 

గతంతో పోలిస్తే పెండింగ్‌లో వున్న నెలల సంఖ్య తక్కువగా వున్నప్పటికీ బిల్లుల మొత్తం ఎక్కువగా వున్నట్టు ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఇటీవల నూటికి 80-90 శాతం మంది ఆరోగ్యశ్రీలోనే చికిత్స పొందుతున్నారు.  డబ్బు చెల్లించి వైద్యం చేయించుకునే వారి సంఖ్య తగ్గిందని, దీనివల్ల ప్రభుత్వం చెల్లించే బిల్లులపైన ఆధారపడాల్సి వస్తోందని పలు ఆస్పత్రుల యజమానులు చెబుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రులకు సుమారు రూ.40 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. ఒక్కో ఆస్పత్రికి కనిష్ఠంగా రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్లు వరకు విడుదల కావలసి ఉంది. దసరాకు సిబ్బందికి జీతాలు చెల్లించడానికి బ్యాంకుల నుంచి అప్పు తీసుకువచ్చినట్టు పలు ఆస్పత్రుల నిర్వాహకులు చెబుతున్నారు. 


రేట్లు తగ్గింపుపై ఆందోళన.. 

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ పథకాన్ని కలిపి రాష్ట్రంలో అమలు చేయనున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డుల జారీకి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదిలావుండగా కొన్నేళ్ల నుంచి ఆరోగ్యశ్రీలో అందిస్తున్న వైద్య సేవల (ప్రొసీజర్స్‌)కు ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తాన్ని కుదించే యోచనలో వున్నట్టు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే యాజమానులతో సమావేశం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నా యంటున్నారు. ఒకవేళ రేట్లు కుదిస్తే మాత్రం ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ నెట్‌వర్క్‌లో వుండేందుకు అంగీకరించబోమని ఆస్పత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-10-07T06:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising