ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు గృహనిర్బంధం

ABN, First Publish Date - 2022-01-21T06:09:46+05:30

ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీకి వ్యతిరేకంగా గురువారం ‘చలో కలెక్టరేట్‌’ ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమైన ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.శ్యామ్‌సుందర్‌ను పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచి గృహనిర్బంధం చేశారు.

పోలీసుల గృహనిర్బంధంలో ఏపీటీఎఫ్‌ నేతలు శ్యామ్‌సుందర్‌, రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చలో కలెక్టరేట్‌’కు వెళ్లకుండా నిలువరించిన పోలీసులు


పాడేరు, జనవరి 20: ప్రభుత్వం ప్రకటించిన పీఆర్‌సీకి వ్యతిరేకంగా గురువారం ‘చలో కలెక్టరేట్‌’ ఆందోళనలో పాల్గొనేందుకు సిద్ధమైన ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.శ్యామ్‌సుందర్‌ను పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచి గృహనిర్బంధం చేశారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమ పోరాటాన్ని ఆపలేరని, ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళనలను ఉధృతంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు మరో నేత రామకృష్ణ... ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. 


ఉద్యోగుల పోరాటానికి టీడీపీ మద్దతు: గిడ్డి ఈశ్వరి

పాడేరు, జనవరి 20: పీఆర్‌సీ, ఇతర డిమాండ్లపై ఉద్యోగులు చేస్తున్న ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణమద్దతు తెలుపుతున్నదని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తెలిపారు. రాష్ట్ర విభజన తరువాత ఆర్థిక కష్టాలు ఉన్నప్పుడే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని, కానీ ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం 23 శాతం మాత్రమే ఇచ్చి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. జగన్‌ నిజస్వరూపం ఏమిటో ఉద్యోగులు ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు.


Updated Date - 2022-01-21T06:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising