ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పన్న హుండీ ఆదాయం రూ.1.47 కోట్లు

ABN, First Publish Date - 2022-06-29T05:59:29+05:30

వరాహలక్ష్మీనృసింహస్వామికి గడచిన 27 రోజులలో భక్తులు ఆలయ హుండీలలో సమర్పించిన మొక్కుబడుల ద్వారా రూ.1.47 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ ఈఓ సురేష్‌ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఆలయ బేడామండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు.

హుండీలు లెక్కిస్తున్న స్వచ్ఛంద సేవకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, జూన్‌ 28: వరాహలక్ష్మీనృసింహస్వామికి గడచిన 27 రోజులలో భక్తులు ఆలయ హుండీలలో సమర్పించిన మొక్కుబడుల ద్వారా రూ.1.47 కోట్ల ఆదాయం సమకూరింది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంవీ సూర్యకళ, జ్ఞానాపురం ఎర్నిమాంబ ఆలయ ఈఓ సురేష్‌ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఆలయ బేడామండపంలో హుండీల లెక్కింపు చేపట్టారు. నగదు రూపంలో రూ.1,47,55,531 లభ్యంకాగా, 122.8 గ్రామల స్వర్ణం, 14.2 కిలోల రజిత ఆభరణాల రూపంలో ఖజానాకు జమయింది. 148 అమెరికన్‌ డాలర్లు, కువైట్‌కు చెందిన 1.25 దీనార్లు, బీజీఈకి చెందిన 20 యూరోలు, న్యూజిలాండ్‌కు చెందిన 50 డాలర్లు, కెనడాకు చెందిన 25 డాలర్లు లభించాయి. లెక్కింపులో దేవస్థానంలోని వివిధ విభాగాలకు చెందిన ఏఈఓలు, పర్యవేక్షణాధికారులు, శ్రీహరిసేవా సత్సంగ్‌ సేవకులు, ఎస్‌వీఎల్‌ఎన్‌ వాకర్స్‌క్లబ్‌ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-29T05:59:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising