ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఐఐసీ భూముల్లో గ్రావెల్‌ దందా

ABN, First Publish Date - 2022-12-31T01:33:19+05:30

అధికార పార్టీ నాయకులు, ఏపీఐఐసీ అధికారులు కుమ్మక్కయారు.

గ్రీనరీకి కేటాయించిన స్థలంలో గ్రావెల్‌ తవ్విన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అచ్యుతాపురం, డిసెంబరు 30: అధికార పార్టీ నాయకులు, ఏపీఐఐసీ అధికారులు కుమ్మక్కయారు. సంస్థకు చెందిన ఖాళీ భూముల్లో రాత్రిపూట గ్రావెల్‌ తవ్వి, అమ్ముకుంటున్నారు. డిసెంబరు 15వ తేదీన సెజ్‌లోని ఒక కర్మాగారానికి రెండు వేల క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ను రవాణా చేశారని తెలిసింది.

ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌)లోని కర్మాగారాల్లో లోతట్టు ప్రదేశాలను పూడ్చడానికి భారీ మొత్తంలో గ్రావెల్‌ కావాలి. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పార్టీ నాయకులు గ్రావెల్‌ దందా మొదలుపెట్టారు. మండలంలోని నునపర్తి పంచాయతీ నడింపల్లి, రాంబిల్లి మండలం పంచదార్లలో డి.పట్టా భూముల చదును పేరుతో భారీ స్థాయిలో గ్రావెల్‌ తవ్వారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో గ్రావెల్‌ తవ్వకాలు ఆపేశారు. తాజాగా ఏపీఐఐసీ భూములపై నేతల పడింది. సెజ్‌లో రుషీల్‌ డెకార్స్‌ కర్మాగారం వెనుక గ్రీనరీకి కేటాయించిన భూమిలో గ్రావెల్‌ తవ్వకాలు ప్రారంభించారు. అక్కడ కొంతలోతు తవ్వే సరికి నీరు పడడంతో తవ్వకాలు ఆపేసి, కొద్ది దూరంలో గల మెరక ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు.

Updated Date - 2022-12-31T01:33:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising