ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరకు రైతులు, కార్మికులకు వెంటనే బకాయిలు చెల్లించాలి

ABN, First Publish Date - 2022-02-16T05:32:01+05:30

ఏటికొప్పాక చక్కెర కర్మాగారానికి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.4 కోట్లు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు రూ.7.5 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

షుగర్‌ ఫ్యాక్టరీ గేటు వద్ద ఆందోళన చేస్తున్న ఏపీ రైతు సంఘం నాయకులు, రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ రైతు సంఘం కార్యదర్శి ప్రసాద్‌ డిమాండ్‌


ఎస్‌.రాయవరం, ఫిబ్రవరి 15: ఏటికొప్పాక చక్కెర కర్మాగారానికి గత సీజన్‌లో చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.8.4 కోట్లు, ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకు రూ.7.5 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం షుగర్‌ ఫ్యాక్టరీ గేటు వద్ద రైతులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నదని, దీంతో రైతులు, కార్మికులు తీవ్రఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం ప్రతినిధులు అన్నం వెంకటరమణ, మేకా సత్యనారాయణ, గొలుగొండ నూకినాయుడు, కాసుబాబు, మాకిరెడ్డి రామునాయుడు, గురుబాబు, కార్మిక సంఘ ప్రతినిధులు నగరి అప్పారావు, దార పోలయ్య, కాట్రగడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-02-16T05:32:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising