ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌ మిలింద్‌ సోనీ

ABN, First Publish Date - 2022-05-21T04:31:07+05:30

ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ నిర్వహించిన ఐజీయూ అంరఽధప్రదేశ్‌ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో తెలంగాణకు చెందిన మిలింద్‌సోనీ విజేతగా నిలిచాడు.

విజేతలతో నిర్వాహకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రన్నర్‌గా గుజరాత్‌కు చెందిన అరన్‌ రాకీ

మూడో స్థానంలో యూపీకి చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ వరూన్‌ పర్మార్‌

విశాఖపట్నం (స్పోర్ట్సు), మే 20: ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ నిర్వహించిన ఐజీయూ అంరఽధప్రదేశ్‌ అమెచ్యూర్‌ గోల్ఫ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో తెలంగాణకు చెందిన మిలింద్‌సోనీ విజేతగా నిలిచాడు. ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌లో నాలుగురోజులపాటు జరిగిన 18 హోల్స్‌ కోర్సు ఈవెంట్‌లో మిలింద్‌ సోనీ 294 స్ర్టోక్‌లతో లక్ష్యాన్ని పూర్తిచేసి చాంపియన్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. గుజరాత్‌కు చెందిన ఆరన్‌రాకీ 297 స్కోరుతో ద్వితీయ స్థానం సాధించాడు.


తృతీయ స్థానానికి జరిగిన పోటీలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన హరిమోహన్‌, ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ వరూన్‌ పర్మార్‌ ఇద్దరూ చెరో 298 పాయింట్లు సాధించడంతో టై అయింది. అయితే చివరి రోజు ఆటలో ఉత్తమ స్కోరు చేసిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ వరూన్‌ పర్మార్‌ తృతీయ స్థానాన్ని దక్కించుకున్నాడు. దేశవ్యాప్తంగా 73 మంది గోల్ఫర్లు పాల్గొన్న ఈ టోర్నీ తొలిరోజు ఆటలో హర్యానాకు చెందిన హరిమోహన్‌సింగ్‌ ఆధిక్యత ప్రదర్శించగా రెండోరోజు ఆటలో తెలంగాణాకు చెందిన మిలింద్‌ సోనీ అద్భుతంగా రాణించి సమాన స్కోరుతో ఆధిక్యత కోసం పోటీపడ్డాడు.


చివరి రోజు ఆటలో తొమ్మిది మంది గోల్ఫర్లు ఆధిక్యత కోసం హోరాహోరీగా పోటీపడ్డారు. తెలంగాణా గోల్ఫర్‌ మిలింద్‌ సోనీ అనూహ్యంగా రాణించి ప్రత్యర్ధి కన్నా కేవలం మూడు పాయింట్ల ఆధిక్యత స్కోరుతో చాంపియన్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. శుక్రవారం జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ కార్యదర్శి ప్రశాంత్‌ సాగి ముఖ్య అతిథిగా  హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. 

Updated Date - 2022-05-21T04:31:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising