భారత్ పవర్ లిఫ్టింగ్ జట్టులో ఆంధ్ర క్రీడాకారులు
ABN, First Publish Date - 2022-11-28T00:40:47+05:30
ఆక్లాండ్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర క్రీడాకారులు ఆదివారం పయనమయ్యారు.
విశాఖపట్నం(స్పోర్ట్సు), నవంబరు 27: ఆక్లాండ్‌లో జరగనున్న ఇంటర్నేషనల్ కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ టోర్నీలో పాల్గొనే భారత్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్ర క్రీడాకారులు ఆదివారం పయనమయ్యారు. న్యూజిలాండ్‌లో జరిగే ప్రతిష్ఠాత్మక టోర్నీ మహిళల విభాగంలో ఎన్.జ్ఞాన దివ్య (84 ప్లస్ కిలోలు), షేక్ సాదియా అల్మాస్(57 కిలోలు), మణి శ్రావణి(84 కిలోలు)...పురుషుల కేటగిరీలో షేక్ సాకిబ్ బాష(120 ప్లస్ కిలోలు), ఎస్.కృపారావు(66 కిలోలు), ఎం.దుర్గాప్రసాద్ (93 కిలోలు), బి.అనిల్ కువర్(83 కిలోలు) పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్ర నుంచి ఎంపికైన క్రీడాకారులను పవర్ లిఫ్టింగ్ సంఘం సౌత్‌జోన్ కార్యదర్శి సకల కోటేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రభాకర్, కార్యదర్శి ఎస్.సూర్యనారాయణ, కోశాధికారి పీవీ సంజీవ్, ఇతర ప్రతినిధులు అభినందించారు.
Updated Date - 2022-11-28T00:40:50+05:30 IST