ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సీడ్స్‌’ ఘటనపై విచారణ జరపాలి

ABN, First Publish Date - 2022-08-04T07:01:17+05:30

సీడ్స్‌ కర్మాగా రంలో ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సీపీఎం నాయకులు ఇక్కడి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పూడిమడక రోడ్డులో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథంను అరెస్టు చేస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   సీపీఎం నాయకుల డిమాండ్‌  

 పూడిమడక రోడ్డులో  రాస్తారోకో 

అరెస్టు చేసిన పోలీసులు 

 ప్రభుత్వ తప్పిదమే : ఏఐటీయూసీ నాయకులు

అనకాపల్లి టౌన్‌, ఆగస్టు 3 : సీడ్స్‌ కర్మాగా రంలో ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సీపీఎం నాయకులు ఇక్కడి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న పూడిమడక రోడ్డులో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. బ్రాండిక్స్‌కు బస్సులు వెళ్లకుండా  బైఠాయించారు.  పట్టణ ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో వచ్చి సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, ఎ.బాలకృష్ణ, సీఐటీ యూ నాయకులు గనిశెట్టి సత్యనారాయణ, వీవీ శ్రీనివాసరావులను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న తమను అరెస్టు చేయడం సరికాదని లోకనాథం పేర్కొన్నారు. సీడ్స్‌ సంఘటనకు సంబంధించి బ్రాండిక్స్‌ ఇండియా భాగస్వామి దొరస్వామిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.  

తుమ్మపాల : సీడ్స్‌ కంపెనీ యాజమాన్యంపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలని ఏఐటీయూసీ జాతీయ కమిటీ సభ్యుడు బూసి వెంకటరావు డిమాండ్‌ చేశా రు.  ఈ మేరకు బుధవారం ఎన్టీఆర్‌ వైద్యాలయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. సీడ్స్‌ కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించక పోవడంవల్లే ప్రమాదం చోటుచేసుకుందని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వ వైఫల్యం కూడా ఉం దని మండిపడ్డారు. అనంతరం  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ కార్య క్రమంలో యూనియన్‌ నాయకులు వైఎన్‌ భద్రం, కోన లక్ష్మణ, ఎల్‌వీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T07:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising