ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగ వార్షిక క్యాలెండర్‌ విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-08-17T05:57:28+05:30

ఉద్యోగ వార్షిక క్యాలెండర్‌ విడుదల చేయాలని మంగళవారం నిరుద్యోగులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఎంవీపీ కాలనీలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు తరలివచ్చారు.

ఎంవీపీ కాలనీలో మోకాళ్లపై కూర్చుని నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపిన నిరుద్యోగులు 

ఎంవీపీ కాలనీ, ఆగస్టు 16: ఉద్యోగ వార్షిక క్యాలెండర్‌ విడుదల చేయాలని మంగళవారం నిరుద్యోగులు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ ఏపీ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఎంవీపీ కాలనీలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి నిరుద్యోగులు తరలివచ్చారు. ఏఎస్‌ రాజా కళాశాల వద్ద మోకాళ్లపై నిలిచి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్‌కుమార్‌ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నిశాఖల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి దానిని నిలుపుకోలేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు  దాటినా పోలీస్‌, డీఎస్సీ, గ్రంథాలయశాఖ, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, గ్రూప్‌1, 2, 3, 4 ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచూపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్తిరాజు, రౌతు వాసు, శివకుమార్‌, సతీశ్‌, హరీశ్‌, రూప, రజిని, లక్ష్మి, తిరుపతిరావు, సంతోశ్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-17T05:57:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising