ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రుల భవిత కోసమే అమరావతి పోరాటం

ABN, First Publish Date - 2022-09-21T06:25:53+05:30

అమరావతి పోరాటం 29 గ్రామాల ప్రజల కోసం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు.

నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న బండారు సత్యనారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి

పెందుర్తి, సెప్టెంబరు 20: అమరావతి పోరాటం 29 గ్రామాల ప్రజల కోసం కాదని, ఐదు కోట్ల ఆంధ్రుల భవిత కోసం అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పెందుర్తిలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. గ్రామ స్థాయిలో పార్టీ పటిష్టతపై సమీక్షించారు. అఽధికార వైసీపీ నాయకుల అరాచకాల వల్ల టీడీపీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై చర్చించారు. ఓటర్‌ లిస్ట్‌ పరిశీలన, ఓటర్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం, టీడీపీ సభ్యత్వ నమోదు, బాదుడే బాదుడు కార్యక్రమాలను త్వరి తగతిన పూర్తిచేయాలని తీర్మానించారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ మా రాజఽధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే స్థాయి నుంచి వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో మాకు రాజధాని లేదు అని చెప్పాల్సిన దుస్థితికి దిగజారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములను త్యాగం చేసిన రైతులకు టీడీపీ ప్రభుత్వం హయాంలో వందనాలు చెప్పి నూతన వస్త్రాలు ఇస్తే.. అరాచక వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు లాఠీ దెబ్బలు రుచి చూపిస్తుందన్నారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు టీడీపీ సంఘీభావం తెలుపుతూ పాదయాత్రలో పాల్గొంటుందని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు, కార్పొరేటర్లు సేనాపతి వసంత శంకరరావు, బల్ల శ్రీనివాసరావు, రాపర్తి కన్నా, మాజీ జెడ్పీటీసీ రెడ్డి నారాయణరావు, నాయకులు కరక దేవుడు, వియ్యపు చిన్న, వేగి పరమేశ్వరరావు, దాట్ల మధు, శ్రీను యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-21T06:25:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising