ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీఎఫ్‌-7పై అప్రమత్తంగా ఉన్నాం: రజిని

ABN, First Publish Date - 2022-12-23T03:22:51+05:30

దేశంలో ఒమైక్రాన్‌ బీఎఫ్‌-7 వేరియంట్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఒమైక్రాన్‌ బీఎఫ్‌-7 వేరియంట్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకట కుమారితో కలిసి జీవీఎంసీ, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో గురువారం ఆమె సమీక్ష నిర్వహించారు. బీఎఫ్‌-7 వేరియంట్‌తో ఇప్పటికప్పుడు రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా... జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పండుగ సీజన్‌ నేపథ్యంలో వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నామన్నారు.

50 మున్సిపాలిటీల్లో హ్యాండ్‌వాష్‌ స్టేషన్లు: మెప్మా

అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): యూనిసెఫ్‌ సహకారంతో ఎంపిక చేసిన 50 మున్సిపాలిటీల్లో పట్టణ మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో హ్యాండ్‌ వాష్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని మెప్మా గురువారం తెలిపింది. 500 లీటర్ల నీరు, 10 లీటర్ల లిక్విడ్‌ సోప్‌ సామర్థ్యమన్ను ట్యాంకర్లను ఏర్పాటు చేయనున్నట్టు మెప్మా అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి 27 మధ్యలో హ్యాండ్‌ వాష్‌ స్టేషన్లను సంబంధిత ప్రజాప్రతినిధుల ద్వారా ఎంపిక చేసిన అన్ని పట్టణాల్లో ప్రారంభిస్తామని వివరించారు.

Updated Date - 2022-12-23T03:22:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising