ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంచి భవిష్యత్తుకు లక్ష్యం కీలకం

ABN, First Publish Date - 2022-03-06T05:14:09+05:30

ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్తు కోసం మంచి లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ సూచించారు.

జస్టిస్‌ మానవేంద్ర రాయ్‌కు మెమోంట్‌ అందజేస్తున్న మధుకుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రరాయ్‌

విశాఖపట్నం, మార్చి 5: ప్రతి విద్యార్థి బంగారు భవిష్యత్తు కోసం మంచి లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అందుకు అనుగుణంగా అడుగులు వేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ సూచించారు. డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య ఇంజనీరింగ్‌ కళాశాలలో  ‘కెరీర్‌ ప్లానింగ్‌’ అనే అంశంపై శనివారం నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థుల నుద్దేశించి ఆయన మాట్లాడారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకునే మార్గాలు, వృత్తిపరంగా తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు.


వృత్తిపరంగా తాను ఆదర్శంగా భావించే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హన్స్‌రాజ్‌ ఖన్నా గురించి వ్యాఖ్యానిస్తూ ఎమర్జెన్సీ సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు. దేశ రాజ్యాంగం మనుగడలో ఉన్నంత కాలం జస్టిస్‌ హన్సరాజ్‌ ఖన్నా జనం మదిలో నిలిచివుంటారని చెప్పారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు.


కార్యక్రమంలో భాగంగా జస్టిస్‌ మానవేంద్రరాయ్‌ని కళాశాల సెక్రటరీ అండ్‌ కరస్పాండెంట్‌ డాక్టర్‌ జి.మధుకుమార్‌ సత్కరించి మెమెంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చక్రవర్తి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.వి.హెచ్‌.శ్రీకాంత్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ దీపాక్‌ చౌదరీ, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:14:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising