ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరు అంశాలతో అజెండా

ABN, First Publish Date - 2022-08-04T06:56:05+05:30

ఈనెల పదిన జరిగే జీవీఎంసీ కార్యవర్గం సాధారణ సమావేశా నికి ఆరు అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వీటిపై సభ్యులు చర్చిస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిసెంబరు 31 నాటికి నగరంలో 120 

మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ నిషేధం

కొత్త వెండింగ్‌ కమిటీ నియామకంపై చర్చ

10న జీవీఎంసీ కౌన్సిల్‌ సమావేశం 

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఈనెల పదిన జరిగే జీవీఎంసీ కార్యవర్గం సాధారణ సమావేశా నికి ఆరు అంశాలతో అజెండాను సిద్ధం చేశారు. మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వీటిపై సభ్యులు చర్చిస్తారు. ప్లాస్టిక్‌ వ్యర్థ నిర్వహణ నిబంధనలు-2016 ప్రకారం 120 మైక్రాన్ల కం టే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించే అంశాన్ని కౌన్సిల్‌ ఆమోదానికి పెట్టనున్నారు. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి నగరంలో 75 మైక్రాన్లలోపు సింగిల్‌యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించారు. దశలవారీగా ప్లాస్టిక్‌ను రద్దుచేయాలనే లక్ష్యంలో భాగంగా డిసెంబరు 31 నాటికి 120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌ను నిషేధించాలని కమిషనర్‌ భావిస్తున్నారు. జీవీఎంసీ పరిధిలో తోపుడు బండ్ల వ్యాపారులకు అనుమతులను అజెండాలో చేర్చారు. సమస్యల పరిష్కారం కోసం పనిచేసే వెండింగ్‌ కమిటీ నియామ కంపై చర్చజరపనున్నారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న 25 మందిని జీవీఎంసీలో విలీన ప్రతిపాదనపై  ఆమోదం తీసుకోనున్నారు. కొత్తగా ఎన్నికైన స్టాండింగ్‌ కమిటీని ప్రకటించడం, 12 ఏళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉపాధ్యాయులకు స్పెషల్‌గ్రేడ్‌ స్కేల్‌ వర్తింపు, విలీన పంచాయతీల్లో అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఆప్కోస్‌ ద్వారా జీతాల చెల్లింపు అంశాలు అజెండాలో చేర్చారు.

Updated Date - 2022-08-04T06:56:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising