ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రావెల్‌ అక్రమాలపై చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-22T06:01:19+05:30

మండలంలో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు ఆరోపించారు. వాడ్రాపల్లి నుంచి గ్రావెల్‌ తరలింపుపై టీడీపీ నాయకులు సమాచారం ఇచ్చినా రెవెన్యూ సిబ్బంది చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట టీడీపీ నేతల ఆందోళన

మునగపాక, జనవరి 21: మండలంలో గ్రావెల్‌ను అక్రమంగా తవ్వి తరలిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు ఆరోపించారు. వాడ్రాపల్లి నుంచి  గ్రావెల్‌ తరలింపుపై టీడీపీ నాయకులు సమాచారం ఇచ్చినా రెవెన్యూ సిబ్బంది చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అనంతరం  తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చి తోటాడ, పాటిపల్లి, వాడ్రాపల్లి ప్రాంతాల నుంచి కాలనీల చదును పేరుతో అక్రమంగా కొండలు తవ్వి అమ్ముకుంటున్నారని బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వాడ్రాపల్లిలో అధికార పార్టీ నాయకుడే గ్రావెల్‌ అమ్ముకున్నా అధికారులు పట్టించుకోలేదన్నారు. అనంతరం ఇన్‌చార్జి తహసీల్దార్‌ చందనరేఖకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నేతలు దాడి ముసిలినాయుడు, పెంటకోట విజయ్‌, ఆడారి గోవింద, జేకే బ్రదర్స్‌, మురళీ,  మొల్లేటి సత్యనారాయణ, మళ్ల రాజేష్‌, ఉస్తేలునాయుడు, దాడి శివ, సూరిశెట్టి రాము, మళ్ల వరహా నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. 


చర్యలు తీసుకోకుంటే ఆందోళన 

అచ్యుతాపురం: మండలంలో అక్రమ గ్రావెల్‌ రవాణా దారులపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకుంటీ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద భారీ స్థాయిలో ఆందోళన చేస్తామని టీడీపీ ఎలమంచిలి నియోజకవర్గం ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు హెచ్చరించారు. మండలంలో వైసీపీ నాయకులు గ్రావెల్‌ అక్రమ రవాణా చేశారని, దీనిపై ఈనెల 8న భారీ స్థాయిలో ధర్నా నిర్వహించామన్నారు. చోడపల్లి కొండను జగనన్న గృహాలకు చదును పేరుతో తవ్వేసి రూ.లక్షలు దోచుకున్నారన్నారు.  దోచుకున్న వారి వివరాలతో ఆందోళన చేసినా అఽధికారుల్లో చలనం కనిపించలేదని, విచారణ కూడా జరపకపోవడం వారి పనితీరుకి అద్దంపడుతోందన్నారు.  


Updated Date - 2022-01-22T06:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising